ఆ పురుగులొచ్చాయంటే వర్షాలకు కరవు లేనట్టే

మొన్నటివరకు భానుడు తన ప్రతాపం చూపించాడు. వేసవి తాపంతో ప్రజలు అల్లాడిపోయారు. మొన్నటి నుంచే వర్షాలు కురవడం మొదలైంది. ఇక తాజాగా బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ క్రమంలో వాతావరణం చల్లచల్లగా మారుతోంది. ఇలాంటి సమయంలోనే ప్రకృతి తన అందాలను మనుషులకు పరిచయం చేస్తుంది. అందులో ఒకటి ఆరుద్ర పురుగులు.

ఆ పురుగులొచ్చాయంటే వర్షాలకు కరవు లేనట్టే

|

Updated on: May 25, 2024 | 11:19 AM

మొన్నటివరకు భానుడు తన ప్రతాపం చూపించాడు. వేసవి తాపంతో ప్రజలు అల్లాడిపోయారు. మొన్నటి నుంచే వర్షాలు కురవడం మొదలైంది. ఇక తాజాగా బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ క్రమంలో వాతావరణం చల్లచల్లగా మారుతోంది. ఇలాంటి సమయంలోనే ప్రకృతి తన అందాలను మనుషులకు పరిచయం చేస్తుంది. అందులో ఒకటి ఆరుద్ర పురుగులు. ఈ పేరు చెపితే మీలో చాలా మందికి తెలియకపోవచ్చు. కానీ, మనం చదువుకునే రోజుల్లో స్కూళ్లకి వెళ్లే సమయంలో ఇలాంటి పురుగులు ఎక్కువగా కనిపించేవి. ఎర్రని ఎరుపుతో ఒళ్లంతా ఒత్తుగా సింధూరం పూసుకున్నట్టు కనబడే మెత్తని మేను కలిగిన పురుగు ఆరుద్ర పురుగు. ఇవి చూడ్డానికి చిటికెన వేలు గోరంతే ఉంటాయి. వీటిని కొన్ని ప్రాంతాల్లో ‘కుంకుమ పురుగులు’ అని కూడా అంటారు. వర్షాకాలం ప్రారంభమయ్యే సమయాన్ని ఆరుద్ర కార్తె అంటారు. ఆరుద్ర కార్తె మొదలవగానే రైతులు వ్యవసాయ పనులు ప్రారంభిస్తారు. ఈ కార్తెలో మొక్కలపైన, తడిసిన నేలపైన ఈ పురుగులు కనబడతాయి. అందుకే ఈ పురుగులకు ఆరుద్ర పురుగులు అనే పేరు వచ్చింది. కానీ ఇవి ప్రస్తుతం అంతరించే పరిస్థితి ఏర్పడింది. ఇవి సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే కనిపిస్తూ ఉంటాయి. వర్షాలు మొదలవుతున్న ఇలాంటి తరుణంలో తాజాగా హైదరాబాద్ నగరం పాతబస్తీలో ఈ పురుగులు కనిపించాయి. దీంతో స్థానిక ప్రజలు వీటిని నేలపై నుంచి ఏరుకుంటూ అరచేతిలో ఉంచుకుని సంబరపడ్డారు. ఇవి చూడటానికి ఎంతో అందంగా కనిపిస్తున్నాయి. దీంతో చిన్నపిల్లలు వాటిని చూస్తూ ఆడుకోవడం మొదలుపెట్టారు. ఈ పురుగుల జీవితకాలం కూడా చాలా తక్కువే.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అందుకే మరి… ఏనుగును తక్కువ అంచనా వేయకూడదు

పెరగనున్న టోల్ ఛార్జీలు.. వాహనదారుల జేబుకు చిల్లు

Follow us
రైల్లో జవాను.. తాగిన మత్తులో ఏం చేశాడో తెలుసా.? మహిళ ఫిర్యాదు..
రైల్లో జవాను.. తాగిన మత్తులో ఏం చేశాడో తెలుసా.? మహిళ ఫిర్యాదు..
అంబానీ కోడలా మజాకా.. రాధికా మర్చంట్‌ లుక్స్‌ చూశారా.?
అంబానీ కోడలా మజాకా.. రాధికా మర్చంట్‌ లుక్స్‌ చూశారా.?
పీపీఈ కిట్లు ధరించి అంత్యక్రియలు.. ఎందుకంటే.? వీడియో..
పీపీఈ కిట్లు ధరించి అంత్యక్రియలు.. ఎందుకంటే.? వీడియో..
హైదరాబాద్‌లో ధార్ గ్యాంగ్ దోపిడీ.! అప్రమత్తంగా ఉండాలని పోలీసులు..
హైదరాబాద్‌లో ధార్ గ్యాంగ్ దోపిడీ.! అప్రమత్తంగా ఉండాలని పోలీసులు..
జొమాటో డెలివరీ పార్ట్‌నర్స్‌ సీపీఆర్‌ కూడా చేస్తారు.!
జొమాటో డెలివరీ పార్ట్‌నర్స్‌ సీపీఆర్‌ కూడా చేస్తారు.!
ఇండియాలో యూఎస్‌ స్టూడెంట్ వీసా ప్రక్రియ ప్రారంభం.!
ఇండియాలో యూఎస్‌ స్టూడెంట్ వీసా ప్రక్రియ ప్రారంభం.!
ఏనుగుపై కేసు నమోదు.. ఏం చేసిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!
ఏనుగుపై కేసు నమోదు.. ఏం చేసిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!
మనుషుల మధ్యే గ్రహాంతరవాసులు.. హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధన.
మనుషుల మధ్యే గ్రహాంతరవాసులు.. హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధన.
రగులుతోంది మొగలి పొద.. నడి వీధిలో నాగుపాముల సయ్యాట.
రగులుతోంది మొగలి పొద.. నడి వీధిలో నాగుపాముల సయ్యాట.
వీళ్లద్దరి సింక్ బాగుందబ్బా.! | జనసేనానికి వదినమ్మ స్పెషల్ గిఫ్ట్
వీళ్లద్దరి సింక్ బాగుందబ్బా.! | జనసేనానికి వదినమ్మ స్పెషల్ గిఫ్ట్