apkతో సైబర్‌ నేరగాళ్ల మోసం.. ఇంతకీ ఏంటీ మోసం ?? ఎలా దోచేస్తున్నారు ??

apkతో సైబర్‌ నేరగాళ్ల మోసం.. ఇంతకీ ఏంటీ మోసం ?? ఎలా దోచేస్తున్నారు ??

|

Updated on: May 25, 2024 | 11:23 AM

ఆధునిక కాలంలో బ్యాంకింగ్‌ రంగంలో సమూల మార్పులు చోటు చేసుకుంటున్నాయి. డిజిటల్‌ బ్యాంకింగ్‌తో మొత్తం బ్యాంకింగ్‌ వ్యవస్థే మారిపోయింది. స్మార్ట్‌ఫోన్ల ద్వారానే ఆన్‌లైన్‌లో బ్యాంకింగ్‌ లావాదేవీలు క్షణాల్లో పూర్తి చేస్తున్నారు. ఇదే సమయంలో సైబర్‌ నేరగాళ్లు మాటువేసి ఖాతాలకు కాటు వేస్తున్నారు. ఖాతాదారుల అమాయకత్వం, ఏమరుపాటుతో సైబర్‌ కేటుగాళ్లు రోజురోజుకూ సరికొత్త వ్యూహాలతో స్కాములకు తెగబడుతున్నారు.

ఆధునిక కాలంలో బ్యాంకింగ్‌ రంగంలో సమూల మార్పులు చోటు చేసుకుంటున్నాయి. డిజిటల్‌ బ్యాంకింగ్‌తో మొత్తం బ్యాంకింగ్‌ వ్యవస్థే మారిపోయింది. స్మార్ట్‌ఫోన్ల ద్వారానే ఆన్‌లైన్‌లో బ్యాంకింగ్‌ లావాదేవీలు క్షణాల్లో పూర్తి చేస్తున్నారు. ఇదే సమయంలో సైబర్‌ నేరగాళ్లు మాటువేసి ఖాతాలకు కాటు వేస్తున్నారు. ఖాతాదారుల అమాయకత్వం, ఏమరుపాటుతో సైబర్‌ కేటుగాళ్లు రోజురోజుకూ సరికొత్త వ్యూహాలతో స్కాములకు తెగబడుతున్నారు. దీంతో కస్టమర్లను బ్యాంకర్లు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకులు ఎస్బీఐ, పీఎన్‌బీతోపాటు.. ఐసీఐసీఐ, యాక్సిస్‌ వంటి ప్రైవేట్‌ రంగ బ్యాంకులు తమ ఖాతాదారులకు వార్నింగ్‌లు ఇస్తున్నాయి. మొబైల్‌ ఫోన్లకు వచ్చే అనవసరపు మెసేజ్‌లు, లింక్‌లపై క్లిక్‌ చేయవద్దని.. ఓటీపీలు, డెబిట్‌/క్రెడిట్‌ కార్డు నెంబర్ల పిన్‌ నెంబర్లు, ఇతరత్రా సమాచారం ఎవరికీ ఇవ్వరాదని హెచ్చరిస్తున్నాయి. ఇక గుర్తుతెలియని యాప్‌ల జోలికి వెళ్లరాదని, వాటిని ఇన్‌స్టాల్‌ చేసుకోవద్దని కూడా సలహా ఇస్తున్నాయి. రివార్డు పాయింట్లతో ఉచ్చులోకి దించాలని చూసిన మోసగాళ్ల ఎత్తును కనిపెట్టి ఇటీవలే ఎస్బీఐ తమ ఖాతాదారులను అప్రమత్తం చేసింది. మెసేజ్‌లు, ఫోన్‌ కాల్స్‌ పట్ల ఖాతాదారులు అప్రమత్తం కావడంతో.. కేటుగాళ్లు ఇప్పుడు యాప్‌ల ద్వారా వల వేస్తున్నారు. ఏపీకే ఫైల్స్‌తో తెలియకుండానే మొబైల్‌ కస్టమర్లను దోచేస్తున్నారు. ఏపీకే అంటే ఆండ్రాయిడ్‌ అప్లికేషన్‌ ప్యాకేజీ. ఈ ఏపీకే ద్వారా సైబర్‌ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నట్టు ఎస్బీఐ, ఐసీఐసీఐ, ఏయూ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకులు తమ ఖాతాదారులను హెచ్చరిస్తున్నాయి.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆ పురుగులొచ్చాయంటే వర్షాలకు కరవు లేనట్టే

అందుకే మరి… ఏనుగును తక్కువ అంచనా వేయకూడదు

పెరగనున్న టోల్ ఛార్జీలు.. వాహనదారుల జేబుకు చిల్లు

Follow us