ఆ 3 దేశాల దృష్టిలో పాలస్తీనా ఇక స్వతంత్ర దేశం
ఇజ్రాయెల్- హమాస్ యుద్ధంలో ముఖ్య పరిణామం జరిగింది. పాలస్తీనాను స్వతంత్ర దేశంగా గుర్తిస్తూ నార్వే, ఐర్లాండ్, స్పెయిన్ చారిత్రక నిర్ణయం తీసుకున్నాయి. మే 28 నుంచి పాలస్తీనాకు అధికార గుర్తింపును ఇవ్వనున్నట్లు తెలిపాయి. ఈ నిర్ణయం పట్లు పాలస్తీనా వాసులు సంతోషం వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్ తీవ్రంగా వ్యతిరేకించింది. వెంటనే నార్వే, ఐర్లాండ్‌లోని తమ రాయబారులను వెనక్కి రావాలని ఆదేశించింది.
ఇజ్రాయెల్- హమాస్ యుద్ధంలో ముఖ్య పరిణామం జరిగింది. పాలస్తీనాను స్వతంత్ర దేశంగా గుర్తిస్తూ నార్వే, ఐర్లాండ్, స్పెయిన్ చారిత్రక నిర్ణయం తీసుకున్నాయి. మే 28 నుంచి పాలస్తీనాకు అధికార గుర్తింపును ఇవ్వనున్నట్లు తెలిపాయి. ఈ నిర్ణయం పట్లు పాలస్తీనా వాసులు సంతోషం వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్ తీవ్రంగా వ్యతిరేకించింది. వెంటనే నార్వే, ఐర్లాండ్‌లోని తమ రాయబారులను వెనక్కి రావాలని ఆదేశించింది. పాలస్తీనాను అధికారికంగా గుర్తించేందుకు గత కొన్ని వారాలుగా యూరోపియన్ దేశాలు ప్రయత్నాలు చేపట్టాయి. రెండు దేశాల విభజనకు అంగీకరించి ఆ ప్రాంతంలో శాంతిని నెలకొల్పాలని కోరుతున్నాయి. తాజాగా నార్వే నిర్ణయంతో అనేక ఇతర యూరోపియన్ దేశాలు సైతం ఆ వైపు అడుగులు వేసే అవకాశం ఉంది. నార్వేకు ఈయూలో సభ్యత్వం లేకపోయినా రెండు రాష్ట్రాల ప్రతిపాదనకి బలమైన మద్దతును ఇస్తోంది. పశ్చిమాసియా ప్రాంతంలో శాంతి నెలకొనాలంటే గుర్తింపు తప్పనిసరని నార్వే ప్రధానమంత్రి జోనాస్ ఘార్ అన్నారు. మే 28 అధికారికంగా గుర్తించి, అరబ్ శాంతి ప్రణాళికను అమలు చేస్తామని తెలిపారు. మరో వైపు స్వతంత్ర పాలస్తీనాను గుర్తిస్తూ ఐర్లాండ్, స్పెయిన్ ప్రధానమంత్రులు కీలక ప్రకటన చేశారు. పాలస్తీనాకు గుర్తింపు ఇవ్వాలని నిర్ణయించినట్లు ఈ నెల ఆరంభంలోనే అగ్రరాజ్యం అమెరికాకు తెలిపింది స్పెయిన్.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
PM Modi Biopic: మోదీ బయోపిక్‌పై క్లారిటీ ఇచ్చిన నటుడు సత్యరాజ్
Trump Biopic: ట్రంప్ బయోపిక్‌లో మొదటి భార్యపై లైంగికదాడి సీన్
apkతో సైబర్ నేరగాళ్ల మోసం.. ఇంతకీ ఏంటీ మోసం ?? ఎలా దోచేస్తున్నారు ??
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!
3,000 కి.మీ. నడిచి అమ్మవారి చెంతకు చేరిన బుల్లి ఏనుగు!
ఆహా.. ఈ పానీపూరీ అదృష్టమే.. అదృష్టం..
జలపాతం వద్ద షాకింగ్ సీన్..

