PM Modi Biopic: మోదీ బయోపిక్‌పై క్లారిటీ ఇచ్చిన నటుడు సత్యరాజ్
ప్రధాని నరేంద్ర మోదీ బయోపిక్‌కు షూటింగ్ మొదలుకాబోతున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో మోదీ పాత్రలో ప్రముఖ నటుడు సత్యరాజ్ నటిస్తున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. తాజాగా ఆ వార్తలపై ఆయన స్పందించారు. ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో దీని గురించి మాట్లాడారు. తాను నరేంద్ర మోదీ బయోపిక్‌లో నటించనున్నట్లు వస్తోన్న వార్తల్లో నిజం లేదనీ అన్నారు. అవి చూసి తానూ ఆశ్చర్యపోయాననీ ఇటువంటి రూమర్స్ నమ్మకండని కోరారు.
ప్రధాని నరేంద్ర మోదీ బయోపిక్‌కు షూటింగ్ మొదలుకాబోతున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో మోదీ పాత్రలో ప్రముఖ నటుడు సత్యరాజ్ నటిస్తున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. తాజాగా ఆ వార్తలపై ఆయన స్పందించారు. ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో దీని గురించి మాట్లాడారు. తాను నరేంద్ర మోదీ బయోపిక్‌లో నటించనున్నట్లు వస్తోన్న వార్తల్లో నిజం లేదనీ అన్నారు. అవి చూసి తానూ ఆశ్చర్యపోయాననీ ఇటువంటి రూమర్స్ నమ్మకండని కోరారు. ఆ చిత్రం కోసం ఇప్పటివరకు తననెవరూ సంప్రదించలేదనీ సోషల్ మీడియాలో ఇలాంటి తప్పుడు వార్తలను ప్రచారం చేయకండని విజ్ఞప్తి చేశారు. ఒకవేళ ఈ బయోపిక్ కోసం ఎవరైనా సంప్రదించినా తాను అంగీకరించననీ.. ఎందుకంటే అది తన సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఉండే అవకాశముందని క్లారిటీ ఇచ్చారు. గతంలోనూ ఈ విషయంపై ఆయన మాట్లాడుతూ ఇదే మాట చెప్పారు. మోదీ బయోపిక్‌లో తాను నటించబోనన్నారు. మోదీ జీవితంపై బయోపిక్ రావడం ఇదే తొలిసారి కాదు. పీఎం నరేంద్ర మోదీ పేరుతో గతంలో ఓ హిందీ చిత్రం విడుదలైంది. ఒమంగ్ కుమార్ దర్శకత్వం వహించిన ఆ సినిమాలో వివేక్ ఒబెరాయ్ ప్రధాన పాత్ర పోషించారు. అందులో మోదీ బాల్యం నుంచి ప్రధాని అయ్యేవరకు చూపించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Trump Biopic: ట్రంప్ బయోపిక్‌లో మొదటి భార్యపై లైంగికదాడి సీన్
apkతో సైబర్ నేరగాళ్ల మోసం.. ఇంతకీ ఏంటీ మోసం ?? ఎలా దోచేస్తున్నారు ??
ఆ పురుగులొచ్చాయంటే వర్షాలకు కరవు లేనట్టే
తండ్రినే బస్తాలో కుక్కి.. కొరియర్ చేయబోయిన కూతురు
గ్యాస్ కొరతే కాదు.. ఆ జిల్లాలో పెట్రోలు కూడా దొరకట్లేదు
పోస్టర్లు పోయాయి.. పూల మొక్కలు వచ్చాయి
రీల్స్ పిచ్చి.. ప్రమాదవశాత్తూ గన్ పేలడంతో..
మహిళను చంపినంత పని చేసిన రోబో అరెస్ట్ !!
నిమ్మరసానికి 'గ్యాస్ ఛార్జ్'.. బిల్లు చూసి కస్టమర్ షాక్ !!
ఘోర ప్రమాదం.. ఆరుగురు సజీవ దహనం!

