రూ.2,500 కోట్ల ఆస్తికి వారసుడు.. కానీ పాపం
వేల కోట్ల ఆస్తి ఉన్నా అనుభవించే యోగం ఉండొద్దూ అంటుంటారు. సరిగ్గా అదే నిజమైంది యూకేలోని ఓ యువకుడి విషయంలో. అతను ఏకంగా 2500 కోట్ల ఆస్తికి వారసుడు. అయితేనేం హత్య కేసులో జైలు పాలయ్యాడు. ఇరవై నాలుగేళ్ల ఆ యువకుడు ఇక జీవితాంతం జైలులోనే గడపాల్సిందే. బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవాలన్నా కూడా కనీసం 19 ఏళ్లు జైలుశిక్ష అనుభవించాకే వీలవుతుంది.
యూకేలోని వేల్స్‌కు చెందిన ఓ యువకుడికి అక్కడి కోర్టు విధించిన శిక్ష ఇది. 2023 డిసెంబరులో హత్య జరగగా విచారణ జరిపిన కోర్టు తాజాగా శిక్ష విధించింది. యూకేలో ప్రసిద్ధి పొందిన ‘పీటర్ పై’ కంపెనీ స్థాపకుడు స్టేన్లీ థామస్ మనవడు డైలాన్ థామస్ ఈ కేసులో జైలుపాలయ్యాడు. ‘పీటర్ పై’ కంపెనీ ప్రస్తుతం 2500 కోట్ల విలువ చేస్తుందని, ఆ కంపెనీకి డైలాన్ థామసే వారసుడని యూకే మీడియా కథనాలు ప్రచురించాయి. డైలాన్ థామస్ తన చిన్ననాటి స్నేహితుడు విలియం బుష్‌తో కలిసి లాండాఫ్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో కలిసి ఉండేవాడు. 2023 డిసెంబరులో ప్రజలంతా క్రిస్మస్ సంబరాల్లో మునిగి తేలుతుండగా డైలాన్ మాత్రం తన నానమ్మ ఇంటికి వెళ్లాడు. ఆ మరుసటి రోజు తనను లాండాఫ్‌లో దింపేయాలని నానమ్మను కోరగా.. ఆవిడ తన కారులో డైలాన్‌ను తీసుకుని బయలుదేరింది. దారిలో తన స్నేహితుడు బుష్‌కు మెసేజ్ చేసి, అపార్ట్‌మెంట్‌లో ఉన్నాడని నిర్ధారించుకున్నాడు. కారు లాండాఫ్‌లోని అపార్ట్‌మెంట్ వద్దకు చేరుకోగానే నానమ్మను కాసేపు వేచి ఉండమని చెప్పిన డైలాన్.. రహస్యంగా తన ఫ్లాట్‌లోకి వెళ్లాడు. కూరగాయలు కోసే కత్తితో బుష్‌పై దాడి చేసి విచక్షణారహితంగా పొడిచాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఉదయాన్నే బ్లాక్ కాఫీ తాగితే ఇన్ని ప్రయోజనాలా
చియా సీడ్స్ తీసుకుంటున్నారా.. జాగ్రత్త.. ఇలా చేశారంటే
దక్షిణాదికి అత్యున్నత గౌరవం.. సౌత్ దశ తిరిగిందా
TOP 9 ET News: OTTకి పుష్ప2..ఆడియన్స్‌కు షాకిచ్చిన నెట్‌ఫ్లిక్స్ | పాపం! రవితేజ బాలయ్యకే ఆ ఛాన్స్
AI సాయంతో నన్ను అలా మార్చారు.. ఛీ! సిగ్గు చేటు..