చియా సీడ్స్ తీసుకుంటున్నారా.. జాగ్రత్త.. ఇలా చేశారంటే
మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే పౌష్టికాహారం తీసుకోవడం చాలా అవసరం. ఈ విషయాన్ని మనకు కరోనా బాగా గుర్తు చేసింది. ఆహార నియమావళిపై శ్రద్ధ కలిగేలా చేసింది. అప్పటినుంచి అందరూ ఆరోగ్య రీత్యా మేలు చేసే ఆహారానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ క్రమంలో గింజలు, పండ్లు, కూరగాయలు బాగా తింటున్నారు. అయితే మనం తీసుకునే గింజలలో చియా సీడ్స్ కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ మధ్యకాలంలో ఎక్కువగా చియా సీడ్స్ ని అందరూ తింటున్నారు.
అయితే చియా సీడ్స్ ను రోజూ తింటే ఆరోగ్యానికి ఎంత మేలు జరుగుతుందో.. అలాగే కొన్ని అనర్థాలు కూడా జరిగే అవకాశం ఉందట. చియా సీడ్స్ ను ఎక్కువగా తీసుకుంటే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. చియా సీడ్స్ లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఈ ఫైబర్ జీర్ణక్రియకు సహాయపడినా.. ఎక్కువగా తీసుకుంటే జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. వీటిని ఎక్కువ మోతాదులో తీసుకుంటే పొట్ట ఉబ్బరం, గ్యాస్, మలబద్ధకం వంటి ఇబ్బందులు ఎదురవుతాయి. చియా సీడ్స్‌ను తీసుకోవాలంటే నీటిని కూడా తగినంతగా తాగడం చాలా అవసరం అంటున్నారు. నీరు తక్కువగా తాగి ఎక్కువగా చియా సీడ్స్ ను తీసుకుంటే జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి. అంతేకాదు, చియా సీడ్స్ అందరికీ అనుకూలంగా ఉండవు. కొందరికి వీటిని తీసుకున్న తర్వాత అలెర్జీ సమస్యలు ఎదురవుతాయి. చర్మం పై దురద, దద్దుర్లు రావడం, ముఖం వాపు లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగడం వంటి లక్షణాలు తలెత్తవచ్చు. ఇలాంటి సమస్యలు ఎదురైతే వెంటనే వైద్యుడిని సంప్రదించి చియా సీడ్స్ ను తినడం ఆపేయాలి. చియా సీడ్స్‌లో ఆల్ఫా-లినోలెనిక్ యాసిడ్ అధికంగా ఉంటుంది. దీనివల్ల రక్తం పలుచబడి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కానీ రక్తానికి సంబంధించిన చికిత్సలు తీసుకుంటున్నవారు లేదా రక్తపోటు మందులు వాడుతున్నవారు వీటిని అధికంగా తీసుకోవడం వల్ల సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. ఈ విషయాన్ని వైద్యుల సూచనతో ముందుగానే తెలుసుకోవడం మంచిది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
దక్షిణాదికి అత్యున్నత గౌరవం.. సౌత్ దశ తిరిగిందా
TOP 9 ET News: OTTకి పుష్ప2..ఆడియన్స్‌కు షాకిచ్చిన నెట్‌ఫ్లిక్స్ | పాపం! రవితేజ బాలయ్యకే ఆ ఛాన్స్
AI సాయంతో నన్ను అలా మార్చారు.. ఛీ! సిగ్గు చేటు..
రూ.300 కోట్ల సంక్రాంతి !! హిస్టరీ క్రియేట్ చేసిన విక్టరీ వెంకటేష్
Johnny Master: మీ నిజస్వరూపమేంటో.. తొందర్లోనే తెలుస్తుంది! జానీ ఎమోషనల్ పోస్ట్