దక్షిణాదికి అత్యున్నత గౌరవం.. సౌత్ దశ తిరిగిందా
పద్మ పురస్కారాల ప్రకటన అయిపోయింది. ఇప్పుడు ఈ అవార్డుల గురించి డిస్కషన్ మొదలైంది. ఇందులో ముందుగా వినిపిస్తున్న చర్చ ఒక్కటే. దక్షిణాది వాళ్లకి నాలుగు అవార్డులు ఇవ్వడం. నందమూరి బాలకృష్ణ, నటి శోభన, నటుడు అజిత్‌తో పాటు మరో యాక్టర్ అనంత్ నాగ్‌కి పద్మ భూషణ్ పురస్కారాలు లభించాయి.
సినీరంగంలో అందించిన అత్యుత్తమ సేవలకు నందమూరి బాలకృష్ణకి పద్మ భూషణ్ అవార్డు లభించింది. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న నందమూరి అభిమానులను సంబరాల్లో ముంచెత్తింది. అయితే…సాధారణంగా కేంద్ర ప్రభుత్వంపై ఓ విమర్శ ఉంది. నార్త్ వాళ్లకే ప్రియార్టీ ఇస్తోంది..దక్షిణాదిని పెద్దగా పట్టించుకోవడం లేదని. కానీ…మోదీ సర్కార్ ఈ విమర్శను చాలా సాఫ్ట్‌గా హ్యాండిల్ చేస్తోంది. దక్షిణాది రాష్ట్రాలకూ ప్రాధాన్యత ఇస్తున్నామని ప్రత్యక్షంగానో, పరోక్షంగానో చెబుతూనే ఉంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడుపై ఎక్కువగా ఫోకస్ పెడుతోంది. అక్కడి ప్రముఖులకు ప్రియార్టీ ఇస్తోంది. తమపై ఉన్న ఆ విమర్శలకు ఇలా చెక్ పెడుతోంది. అయితే..ఈ సారి పద్మ పురస్కారాల్లో కీలకమైందిగా భావించే పద్మ భూషణ్ అవార్డులను 19 మందికి ఇవ్వగా..అందులో నలుగురు దక్షిణాది వాళ్లే ఉండడం ఆసక్తికరమైన చర్చకు దారి తీసింది. ఇక్కడ ఓ సారి గమనిస్తే..నందమూరి బాలకృష్ణ ఏపీ వ్యక్తి. ఆ తరవాత అజిత్ తమిళనాడు వ్యక్తి. శోభనది కేరళ. మరో నటుడు అనంత్ నాగ్..కర్ణాటక వాడు. ఇలా…అన్ని రాష్ట్రాలనూ గుర్తిస్తూ పద్మ భూషణ్‌లు ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. వీళ్లలో ముందుగా నందమూరి బాలకృష్ణ గురించి చెప్పుకోవాలి. అభిమానులొక్కరే కాదు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలంతా ఆయనను బాలయ్య అని ముద్దుగా పిలుచుకుంటారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
TOP 9 ET News: OTTకి పుష్ప2..ఆడియన్స్‌కు షాకిచ్చిన నెట్‌ఫ్లిక్స్ | పాపం! రవితేజ బాలయ్యకే ఆ ఛాన్స్
AI సాయంతో నన్ను అలా మార్చారు.. ఛీ! సిగ్గు చేటు..
రూ.300 కోట్ల సంక్రాంతి !! హిస్టరీ క్రియేట్ చేసిన విక్టరీ వెంకటేష్
Johnny Master: మీ నిజస్వరూపమేంటో.. తొందర్లోనే తెలుస్తుంది! జానీ ఎమోషనల్ పోస్ట్