ఉదయాన్నే బ్లాక్‌ కాఫీ తాగితే ఇన్ని ప్రయోజనాలా

ఉదయాన్నే బ్లాక్‌ కాఫీ తాగితే ఇన్ని ప్రయోజనాలా

Phani CH

|

Updated on: Jan 30, 2025 | 5:27 PM

చాలామందికి రోజుని కాఫీ లేదా టీతో ప్రారంభించడం అలవాటు. అది తాగనిదే వారికి అడుగు ముందుకు పడదు. అయితే ఉదయాన్నే కాఫీ, టీ కంటే బ్లాక్‌ కాఫీ మంచిదంటున్నారు నిపుణులు. అదెలాగో చూద్దాం. నిద్రలేవగానే బద్ధకంగా అనిపిస్తుంది. బ్లాక్‌ కాఫీలో ఉండే కెఫీన్‌, యాంటీ ఆక్సిడెంట్‌లు మూడ్‌ని రీ ఫ్రెష్‌ చేస్తాయి. అంతేకాకుండా ఈ కాఫీ శరీరానికి శక్తిని అందజేస్తుంది.

రోజుని ప్రారంభించేందుకు కావలసిన ఏకాగ్రతను, మానసిక దృఢత్వాన్ని బ్లాక్‌ కాఫీ అందిస్తుంది. చురుగ్గా ఉంచుతుంది. ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవరచుకోవాలంటే లైఫ్‌ స్టైల్లో బ్లాక్‌ కాఫీని చేర్చుకోవడం ఉత్తమం. జీవక్రియ రేటును పెంచుతుంది. రోజూ ఉదయాన్నే బ్లాక్‌ కాఫీ తీసుకుంటే గుండె సంబంధిత వ్యాధులను అదుపులో ఉంచడంతోపాటు దరిచేరకుండా అడ్డుకుంటుంది. భావోద్వేగాలను అదుపులో ఉంచేందుకు తోడ్పడుతుంది. శరీరంలోని కణాల డ్యామేజన్‌ను తగ్గిస్తుంది. ఒత్తిడికి సంబంధించిన సూచనలను అదుపులోకి తీసుకొస్తుంది. బ్లాక్‌ కాఫీ తీసుకున్న వారిలో టైప్‌2 మధుమేహం సమస్య అదుపులోకి వచ్చినట్టు వివిధ అధ్యయనాల్లో తేలింది. ఇందులో చక్కెరకు బదులుగా తేనె ఉపయోగించాలి. పేగుల కదలికలను ఉత్తేజపరచడంతోపాటు జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఆహారం వేగంగా జీర్ణమవుతుంది. నరాలకు సంబంధించిన వ్యాధులనుంచి ఉపశమనం కలిగిస్తుంది. అల్జీమర్స్‌, అతి ప్రమాదరకమైన పార్కిన్సన్‌ వ్యాధి నుంచి సంరక్షిస్తుంది. ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

చియా సీడ్స్‌ తీసుకుంటున్నారా.. జాగ్రత్త.. ఇలా చేశారంటే

దక్షిణాదికి అత్యున్నత గౌరవం.. సౌత్‌ దశ తిరిగిందా

TOP 9 ET News: OTTకి పుష్ప2..ఆడియన్స్‌కు షాకిచ్చిన నెట్‌ఫ్లిక్స్ | పాపం! రవితేజ బాలయ్యకే ఆ ఛాన్స్

AI సాయంతో నన్ను అలా మార్చారు.. ఛీ! సిగ్గు చేటు..

రూ.300 కోట్ల సంక్రాంతి !! హిస్టరీ క్రియేట్ చేసిన విక్టరీ వెంకటేష్