AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Peddi: 'పెద్ది' ప్రమోషన్స్ లోకి రామ్ చరణ్ ఎంట్రీ

Peddi: ‘పెద్ది’ ప్రమోషన్స్ లోకి రామ్ చరణ్ ఎంట్రీ

Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: May 22, 2026 | 4:27 PM

Share

రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న ‘పెద్ది’ సినిమాలో ‘ఉప్పెన’ కంటే పెద్ద ట్విస్ట్ ఉంటుందని చరణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. ముఖ్యంగా ఢిల్లీ ఎపిసోడ్, ఇండియా గేట్ సన్నివేశాలు ఎమోషనల్ హైలైట్‌గా నిలుస్తాయని చెబుతున్నారు. భారీ అంచనాల మధ్య జూన్ 4న విడుదల కానున్న ఈ సినిమాపై అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది.

పెద్దికి ప్రమోషన్స్ పెద్దగా జరగట్లేదనే బెంగ మొత్తం తీర్చేసారు మేకర్స్. ముఖ్యంగా కొన్ని రోజులుగా ఎక్కడ చూసినా బుచ్చిబాబే కనిపిస్తున్నారు. తాజాగా రామ్ చరణ్ కూడా ప్రమోషన్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. అంతా బానే ఉంది కానీ పెద్దిలో ఉప్పెనను మించిన ట్విస్ట్ ఉండబోతుందా..? బుచ్చిబాబు ఈసారి ఎలాంటి షాక్ ఇవ్వబోతున్నారు..? పెద్దిలో ఆ మేజర్ ట్విస్ట్ ఏంటి..? గత వారం రోజులుగా ఇండస్ట్రీలో పెద్ది పేరు మార్మోగిపోతుంది. రెండు మూడు రోజులు ఇండస్ట్రీ సమస్యలతో ట్రెండ్ అయితే.. ఆ తర్వాత పూర్తిగా ట్రైలర్‌తో ఫామ్‌లోకి వచ్చాడు పెద్ది. విడుదలకు రెండు వారాలే ఉండటంతో జోరు మరింత పెంచేసారు మేకర్స్. తాజాగా బుచ్చిబాబుకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రామ్ చరణ్ చాలా విషయాలపై ఓపెన్ అయ్యారు. వింటున్నారుగా రామ్ చరణ్ ఏమంటున్నారో.. పెద్ది సినిమాలో ఉప్పెన ట్విస్ట్‌ కంటే 100 రెట్లు ఉండే మరో ట్విస్ట్ ఉంటుందంటున్నారు చరణ్. ఇది విన్నాక అభిమానులకు భయంతో కూడిన కంగారు మొదలైంది. టాలీవుడ్ హిస్టరీలోనే ఉప్పెన సెన్సేషనల్ ట్విస్ట్.. దాన్ని మించేలా పెద్దిలో మరో ట్విస్ట్ రాసారు బుచ్చిబాబు. అది కూడా కన్విన్సింగ్‌గా రాసారని చరణ్ సర్టిఫికేట్ ఇచ్చారు. ఉప్పెనలో కొత్త హీరో కాబట్టి ఆ ట్విస్ట్ ఈజీగానే డైజెస్ట్ చేసుకున్నారు ఆడియన్స్. కానీ పెద్ది అలా కాదు.. రామ్ చరణ్ ఆల్రెడీ ఓ స్టార్.. అలాంటి పెద్ద హీరోను పెట్టుకుని మేజర్ ట్విస్ట్ ఇవ్వడం అంటే రిస్కే. బుచ్చిబాబు కూడా ఈ విషయాన్ని ఒప్పుకున్నారు. ఓ పెద్ద హీరో ఇలాంటి కథ ఫైనల్ చేయడం అనేది చిన్న విషయం కాదని ముందు నుంచే హింట్ ఇస్తున్నారు ఈయన. పెద్ది సినిమాలో ఢిల్లీ ఎపిసోడ్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు. ఇండియా గేట్ దగ్గర వచ్చే సీన్స్ గానీ.. ఆ ఎంటైర్ ఎపిసోడ్ అంతా ఎమోషనల్‌గా సాగుతుందని చెప్పారు చరణ్. అంతేకాదు ఈ సీక్వెన్స్ అంతా డిజిటల్ కాకుండా.. క్వాలిటీ కోసం పాత పద్దతిలో రీల్‌తో షూట్ చేసారు రత్నవేలు. ఇలా పెద్దిలో ఇంకా చాలా విశేషాలున్నాయి. జూన్ 4న అవన్నీ బయటికి రానున్నాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Allu Arjun: జస్ట్ మిస్.. లేదంటే.. వీర భద్రుడిగా బన్నీ రెచ్చిపోయేవాడే

Ananya Nagalla: మూడేళ్లు బ్రేకప్ బాధతోనే బతికా.. శాడ్ బ్రేకప్ స్టోరీ

Jayam Ravi: నెలకు 40 లక్షలు ఇవ్వాల్సిందే! భార్య డిమాండ్ విని.. షాక్‌లో స్టార్‌ హీరో!

Peddi: పెద్ది మూవీకి ఐబొమ్మ టెన్షన్..! భారీ యాక్షన్‌కు సిద్ధమైన మేకర్స్

Dragon: 4 నిమిషాల్లోనే సోషల్ మీడియా షేక్.. డ్రాగన్‌తో ఆల్‌టైమ్ రికార్డ్ కొట్టిన ఎన్టీఆర్

Follow Us