Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

డ్రగ్స్‌ ఇచ్చి భర్తను చంపి.. ఏమీ తెలియనట్టు పుస్తకం రాసి.. చివరకు దొరికిపోయింది

డ్రగ్స్‌ ఇచ్చి భర్తను చంపి.. ఏమీ తెలియనట్టు పుస్తకం రాసి.. చివరకు దొరికిపోయింది

Phani CH

|

Updated on: May 16, 2023 | 9:57 AM

అమెరికాలో కౌరీ రిచిన్స్‌ అనే మహిళ తన భర్త చనిపోయాక అతడి జ్ఞాపకార్థం తన పిల్లల కోసం ‘ఆర్‌ యూ విత్‌ మి’ అనే పుస్తకం రాసింది. తన భర్త మరణం తర్వాత తాము అనుభవించిన వేదన, ఎదుర్కొన్న పరిస్థితుల గురించి ఈ పుస్తకం రాసినట్టు ఆమె తెలిపింది. తండ్రిని కోల్పోయిన ఇతర పిల్లలు ఆ భావోద్వేగాల నుంచి బయటపడి..

అమెరికాలో కౌరీ రిచిన్స్‌ అనే మహిళ తన భర్త చనిపోయాక అతడి జ్ఞాపకార్థం తన పిల్లల కోసం ‘ఆర్‌ యూ విత్‌ మి’ అనే పుస్తకం రాసింది. తన భర్త మరణం తర్వాత తాము అనుభవించిన వేదన, ఎదుర్కొన్న పరిస్థితుల గురించి ఈ పుస్తకం రాసినట్టు ఆమె తెలిపింది. తండ్రిని కోల్పోయిన ఇతర పిల్లలు ఆ భావోద్వేగాల నుంచి బయటపడి తిరిగి ఆనందం పొందడానికి ఈ పుస్తకం సహాయపడుతుందని ఆమె పేర్కొంది. దీంతో ఆమె పాఠకుల నుంచి సానుభూతి పొందింది. కానీ, చివరికి తన భర్తను హతమార్చింది ఆమేనని పోలీసులు తేల్చారు. ఆమె తన భర్త ఆహారంలో ఓ డ్రగ్‌ కలిపి అతడిని హత్య చేసినట్టు పోలీసులు తెలిపారు. కౌరీ డార్డెన్‌ రిచిన్స్‌ గతేడాది మార్చి 4న మద్యంలో డ్రగ్‌ కలిపి తన భర్త ఎరిక్‌ రిచిన్స్‌కు ఇచ్చింది. అది తాగిన అతడు అస్వస్థతకు గురయ్యాడు. ఇది గమనించిన మహిళ తన భర్త శరీరం చల్లగా మారిందని 911 నంబరుకు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేసింది. అత్యవసర వైద్య సిబ్బంది అక్కడకు చేరుకొని బాధితుడు బెడ్‌ పక్కన స్పృహ కోల్పోయి ఉండటం గమనించారు. వారు అతడిని కాపాడే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఓటమిని అంగీకరించని శునకం.. చివరికి ??

అందమైన అమ్మాయిలను చూడగానే వెంటపడ్డ ఏనుగు..

అమ్మాయి అడిగింది కదా అని లిఫ్ట్ ఇచ్చాడు.. కట్ చేస్తే జైల్లో ఉన్నారు !!

దిమ్మతిరిగే కటౌట్‌లో యూట్యూబ్‌ను దంచికొడుతున్న రాపో..

Akhil Akkineni: ఎజెంట్ రిజెల్ట్ పై.. అఖిల్ ఎమోషనల్ లెటర్‌