Video Viral: ఈమె చేసిన పనికి నెటిజన్లు ఫిదా… సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న వీడియో..

Video Viral: మానవత్వాన్నిచాటుకునేందుకు ఎన్నో మార్గాలున్నాయి. ఎక్కడ ఏం చేయాలి అనేది ఉండదు. ఏ రూపంలోనైనా మానవత్వాన్ని చాటుకోవచ్చు. మనతో పాటు ఈ ప్రపంచంలో ఎన్నో...

Video Viral: ఈమె చేసిన పనికి నెటిజన్లు ఫిదా... సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న వీడియో..
Video Viral
Follow us
Subhash Goud

| Edited By: Team Veegam

Updated on: Apr 10, 2021 | 12:17 PM

Video Viral: మానవత్వాన్నిచాటుకునేందుకు ఎన్నో మార్గాలున్నాయి. ఎక్కడ ఏం చేయాలి అనేది ఉండదు. ఏ రూపంలోనైనా మానవత్వాన్ని చాటుకోవచ్చు. మనతో పాటు ఈ ప్రపంచంలో ఎన్నో ప్రాణులు సైతం జీవిస్తున్నాయి. వాటిని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తాజాగా ఓ తాబేలును రోడ్డుపై వెళ్తుండగా, గమనించిన ఓ మహిళ దానిని కాపాడిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

అసలై నెమ్మదిగా వెళ్లే తాబేలు ఎక్కడికి వెళ్తుందో తెలియదు గానీ.. రోడ్డులో చిక్కుకుంది. ఇది గమనించిన ఓ మహిళ తాబేలును రక్షించేందుకు ముందుకొచ్చింది. రెండు వస్త్రాల సాయంతో దానిని పట్టుకుని రోడ్డు మీద నుంచి పక్కకు తీసుకెళ్లింది. ఈ రోడ్డు వెంట వెళ్తూ చిక్కుకుపోయిన ఈ తాబేలును రక్షించిన మహిళపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. ఎవరికి నచ్చినట్లు వారు ఆమెపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. సోషల్‌ మీడియాలో పోస్టు చేసిన ఈ వీడియోకు 50 వేల మంది వరకు వీక్షించారు. 900 వరకు లైక్‌లు వచ్చాయి.

ఇవీ చదవండి: మిడ్‌నైట్‌ సన్‌.. భలే వింతగా ఉందే…!! రాత్రి ఎరగని ఆ ప్రదేశం ఎక్కడుందో తెలుసా…? ( వీడియో )

Adorable Video Viral: పనిచేసే కార్మికుడితో సరదాగా ఆటలు ఆడిన అల్లరి గున్న ఏనుగు.. ఎవరు గెలిచారంటే..!

వకీల్‌‌‌‌సాబ్ వసూల్.. తెలుగు రాష్ట్రాల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే…