Watch Video: విమానం ఎక్కనివ్వలేదని.. నేలపై పడి బోరున విలపించిన మహిళ
సాధారణంగా విమానాలు సమయపాలన కచ్చితంగా పాటిస్తాయి. ప్రయాణికులకు బోర్డింగ్ పాస్ ఇవ్వడం, వారిని ఫ్లైట్ లోకి ఎక్కించడం వంటివి నిర్ణీత సమయానికి జరిగిపోతుంటాయి. ఆలస్యంగా వచ్చిన ప్రయాణికుల...
సాధారణంగా విమానాలు సమయపాలన కచ్చితంగా పాటిస్తాయి. ప్రయాణికులకు బోర్డింగ్ పాస్ ఇవ్వడం, వారిని ఫ్లైట్ లోకి ఎక్కించడం వంటివి నిర్ణీత సమయానికి జరిగిపోతుంటాయి. ఆలస్యంగా వచ్చిన ప్రయాణికుల పట్ల విమాన సిబ్బంది కొందరు కఠినంగా వ్యవహరిస్తుంటారు. తాజాగా ఇలాగే జరిగిన ఓ ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. లేట్ గా వచ్చినందుకు విమానంలోకి అనుమతించలేదని ఓ మహిళ తీవ్ర ఆవేదన చెందింది. బాధతో నేలపై పడి విలపించింది. దిల్లీ ఎయిర్ పోర్టులో ఈ ఘటన జరిగింది. సదరు మహిళకు డయాబెటిక్, గుండె సమస్యలు ఉన్నాయని, దీంతో తాము ఐదు నిమిషాలు ఆలస్యంగా వస్తామని సిబ్బందికి ముందే సమాచారం అందించామని బాధితురాలి బంధువులు పేర్కొన్నారు. ఈ సమయంలో సిబ్బంది వైద్యసాయం చేయకుండా సెక్యూరిటీ సిబ్బందిని పిలిచి తమను ఎగ్జిట్ గేటు వద్ద వదిలి రమ్మని ఆదేశించినట్లు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఈ ఘటనపై ఎయిర్ ఇండియా ట్విటర్ వేదికగా స్పందించింది. ప్రస్తుతం ఇంటర్నెట్‌లో సర్క్యూలేట్ అవుతున్న ఆ వీడియో తమ ఇమేజ్‌ను తప్పుదోవ పట్టించేదిగా ఉందని తెలిపింది. వాస్తవాలు తెలుసుకోకుండా, తమ వివరణ కోరకుండా కొందరు ఈ వీడియోను పోస్టు చేశారని ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఇవి కూడా చదవండిView this post on Instagram
#FlyAI : Air India statement on Delhi Airport Video . pic.twitter.com/mHgUkWk13p
— Air India (@airindiain) May 11, 2022
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
ఇవీచదవండి