స్కూటర్‌ను ఢీకొట్టిన కారు.. ఎగిరి వంతెన పిల్లర్‌పై పడిన మహిళ !!

మహిళ డ్రైవ్‌ చేసిన స్కూటర్‌ను ఒక కారు ఢీకొట్టింది. ఈ నేపథ్యంలో ఆ మహిళ వంతెన పైనుంచి ఎగిరి పిల్లర్‌పై పడింది. దీనిని గమనించిన ఇద్దరు వ్యక్తులు ఆమెను కాపాడేందుకు ఆ పిల్లర్‌ వద్దకు చేరుకున్నారు. ఈ విషయం తెలిసిన పోలీసులు, ఫైర్‌ సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. ఫైర్ ఇంజిన్ హైడ్రాలిక్ లిఫ్ట్‌ ద్వారా ఆమెను కిందకు చేర్చారు. ఢిల్లీ శివారు ప్రాంతమైన ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో ఈ ఘటన జరిగింది.

స్కూటర్‌ను ఢీకొట్టిన కారు.. ఎగిరి వంతెన పిల్లర్‌పై పడిన మహిళ !!

|

Updated on: Sep 28, 2024 | 11:59 AM

మహిళ డ్రైవ్‌ చేసిన స్కూటర్‌ను ఒక కారు ఢీకొట్టింది. ఈ నేపథ్యంలో ఆ మహిళ వంతెన పైనుంచి ఎగిరి పిల్లర్‌పై పడింది. దీనిని గమనించిన ఇద్దరు వ్యక్తులు ఆమెను కాపాడేందుకు ఆ పిల్లర్‌ వద్దకు చేరుకున్నారు. ఈ విషయం తెలిసిన పోలీసులు, ఫైర్‌ సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. ఫైర్ ఇంజిన్ హైడ్రాలిక్ లిఫ్ట్‌ ద్వారా ఆమెను కిందకు చేర్చారు. ఢిల్లీ శివారు ప్రాంతమైన ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో ఈ ఘటన జరిగింది. శనివారం సెక్టార్‌ 25 సమీపంలో స్కూటీపై ఎలివేటెడ్ రోడ్‌లో వెళ్తున్న మహిళను కారు ఢీకొట్టింది. దీంతో ఆమె ఎగిరి ఆ వంతెన పిల్లర్‌పై పడింది. తీవ్రంగా గాయపడిన ఆ మహిళ అక్కడి నుంచి కదలలేని స్థితిలో ఉంది. పిల్లర్‌ పై భాగంలో పడి ఉన్న ఆ మహిళను కొందరు గమనించారు. సాహసం చేసిన ఇద్దరు వ్యక్తులు అక్కడకు చేరుకున్నారు. అయితే ఆమెను పైకి చేర్చలేక వారు పైకి రాలేక అక్కడ చిక్కుకుపోయారు. ఇది చూసిన స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడ గుమిగూడారు. మరోవైపు ఈ విషయం తెలుసుకున్న పోలీసులు, ఫైర్‌ సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. ఫైర్ ఇంజిన్ హైడ్రాలిక్ ప్లాట్‌ఫారమ్‌ ద్వారా వారిని కిందకు దించారు. గాయపడిన మహిళను హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఎంపాక్స్ వస్తే ఏం చెయ్యాలి ?? ఆరోగ్య శాఖ ఏం చెబుతోంది ??

దేవర సినిమా చూస్తూ.. ఆగిన అభిమాని గుండె

చెన్నై థియేటర్లో.. దేవరను చూస్తూ అనిరుధ్‌ హంగామా

దేవర థియేటర్లో రాజమౌళి హంగామా

NTR ఫ్యాన్స్‌ను చితగ్గొట్టిన పోలీసులు

Follow us