NTR ఫ్యాన్స్‌ను చితగ్గొట్టిన పోలీసులు

NTR ఫ్యాన్స్‌ను చితగ్గొట్టిన పోలీసులు

Phani CH

|

Updated on: Sep 28, 2024 | 11:24 AM

ఎన్నో అంచనాల మధ్య ... దేవర సినిమా రిలీజ్ అయిన వేళ.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆకాశాన్ని అంటేలా హంగామా చేశారు. తారక్‌ సినిమా రిలీజ్‌ను ఓ రేంజ్లో సెలబ్రేట్ చేసుకున్నారు. దాంతో పాటే దేవర సినిమాను మొదటగా చూడాలని థియేటర్ల వైపు పరుగులు పెట్టారు. ఇక ఈ క్రమంలోనే చాలా ఏరియాల్లోని థియేటర్లు అర్థరాత్రి నుంచే తారక్‌ ఫ్యాన్స్‌ తో కిక్కిరిసిపోయాయి.

ఎన్నో అంచనాల మధ్య … దేవర సినిమా రిలీజ్ అయిన వేళ.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆకాశాన్ని అంటేలా హంగామా చేశారు. తారక్‌ సినిమా రిలీజ్‌ను ఓ రేంజ్లో సెలబ్రేట్ చేసుకున్నారు. దాంతో పాటే దేవర సినిమాను మొదటగా చూడాలని థియేటర్ల వైపు పరుగులు పెట్టారు. ఇక ఈ క్రమంలోనే చాలా ఏరియాల్లోని థియేటర్లు అర్థరాత్రి నుంచే తారక్‌ ఫ్యాన్స్‌ తో కిక్కిరిసిపోయాయి. ఇక అందులో కడపలోని రాజా థియేటర్‌ ప్రాంగణం యంగ్ టైగర్ డైహార్డ్‌ ఫ్యాన్స్‌తో నిండిపోయింది. అది కాస్తా పోలీస్‌లకు తలనొప్పిగా.. లాఠీ ఛార్జ్‌ చేసేలా చేసింది. ఎస్! దేవర అర్థ్రరాత్రి షో చూసేందుకు కడపలోని స్థానిక రాజా థియేటర్‌కు యంగ్‌ టైగర్ ఎన్టీఆర్ అభిమానులు భారీగా చేరుకున్నారు. చేరుకోవడమే కాదు… థియేటర్‌లోకి అందరూ ఒక్కసారిగా చొచ్చుకెళ్లే ప్రయత్నం చేశారు. ఫలితంగా ఫ్యాన్స్ మధ్య చిన్న తోపులాట జరిగింది. ఇక ఇది గమనించిన పోలీసులు.. ఫ్యాన్స్‌ ను అదుపు చేసేందుకు వారిపై లాఠీ ఛార్జ్‌ చేశారు. దొరికనోన్ని దొరికినట్టు చితకబాదారు.అయితే ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అందర్నీ షాక్ అయ్యేలా చేస్తోంది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

దేవర కోసం యాట మొక్కు.. ఎవ్వరూ తగ్గట్లే !!

TOP 9 ET News: దేవర హిట్‌.. యంగ్‌ టైగర్ రియాక్షన్