Viral Video: అరెరె.. రైల్వే స్టేషన్‌లో ప్యాసింజర్ చేసిన పనికి నవ్వులే నవ్వులు..!
థానే రైల్వే స్టేషన్‌లో ఒక వ్యక్తి చేసిన పని వైరల్‌గా మారింది. పైకి వెళ్తున్న ఎస్కలేటర్‌పై కిందికి దిగడానికి ప్రయత్నించిన ఆ వ్యక్తి, అతని ప్రయత్నం ఫలించకపోవడంతో వీడియో నెటిజన్లను బాగా నవ్విస్తోంది. ఈ వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా పంచుకుంటున్నారు.

కొన్ని వీడియోలు భలే ఫన్నీగా ఉంటాయి. పాపం కొంతమంది తెలియక చేస్తారో? లేక తెలిసే సరదాగా చేస్తారో తెలియదు కానీ, పబ్లిక్ ప్లేసుల్లో వాళ్లు చేసే కొన్ని పనులు మాత్రం కడుపుబ్బా నవ్విస్తాయి. ఇది కూడా అలాంటి వీడియోనే. తాజాగా ఓ వ్యక్తి ఎస్కలేటర్‌పై చేసిన విన్యాసం వైరల్‌గా మారింది. సాధారణంగా ఎవరైనా పైకి ఎక్కాలంటే పై వైపు వెళ్తున్న ఎస్కలేటర్, కిందికి వెళ్లాలంటే కింది వైపు వెళ్తున్న ఎస్కలేటర్ ఎక్కుతుంటాం. కానీ, ఈ వీడియోలో ఓ వ్యక్తి పై వైపు వెళ్తున్న ఎస్కలేటర్ ఎక్కి, కిందికి దిగేందుకు ప్రయత్నించాడు.
పాపం.. అతను ఎంత దిగుతున్నా.. ఉన్న చోటనే ఉన్నాడు. ట్రెడ్‌మిల్‌పై రన్నింగ్ చేస్తున్న వ్యక్తిలా, ఇతను ఎస్కలేటర్‌పై వాకింగ్ చేశాడు. ఈ దృశ్యాలను అక్కడున్న ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్‌గా మారింది. ఈ స్టంట్ థానే స్టేషన్‌లో చోటు చేసుకున్నట్లు వీడియోలో పేర్కొన్నారు. అయితే వీడియోకి చాలా ఫన్నీ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. మరి ఆ వీడియోను మీరూ చూసేయండి.
Saw this guy at thane station. byu/_xnknown inmumbai