Video: ఇంటి పెరట్లో పెంపుడు కుక్కకు కనిపించిన కోబ్రా.. ఆ తర్వాత సీన్ చూస్తే ఒళ్లు జలదరించడం ఖాయం
ఇంటి పరిసరాల్లోకి వచ్చిన విషపూరిత నాగపామును రోట్‌వీలర్ జాతికి చెందిన పెంపుడు కుక్క చంపిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కుక్క యజమాని "హిట్లర్ హిట్లర్" అని అరుస్తూ కుక్కను ఆపడానికి ప్రయత్నించినప్పటికీ, కుక్క పామును ముక్కలు చేసింది. ఈ ఘటన నెటిజన్లలో విభిన్న అభిప్రాయాలను రేకెత్తిస్తోంది. కొందరు కుక్క యజమానిపై మానవత్వం లేదని విమర్శిస్తున్నారు.

ఇంటి పరిసరాల్లోకి పాము వచ్చిందని తెలిస్తే చాలా చాలా మంది భయపడతారు. అందులోనూ విషపూరతమైన నాగపాము, కోబ్రా, కట్లపాము, రక్త పింజర వంటివి అంటే మాత్రం వామ్మో.. ఊహించుకుంటుంటేనే భయంగా ఉంది కదా. అయితే ఇంటి పరిసరాల్లోకి పాము వస్తే.. అది పెంపుడు జీవాలైన కోళ్లు, కుక్కలకు కనిపిస్తే అవి అరుస్తూ ఉంటాయి. చాలా మంది కోళ్లు, కుక్కల ప్రత్యేకమైన, భయంతో కూడిన అరుపులు చూసి.. పాము వచ్చిందేమో అని చెప్పేస్తుంటారు. అయితే ఈ వీడియోలో మాత్రం ఓ ఇంటి పెరట్లోకి విషపూరితమైన పాము వస్తే.. ఆ ఇంటి పెంపుడు కుక్క కేవలం అరడం మాత్రమే కాదు.. ఏకంగా దాన్ని ముక్కలు ముక్కలుగా కొరికి అవతల పారేసింది. ఆ దృశ్యాలు చూస్తే ఒకింత భయం కూడా కలుగుతోంది. అలాగే మన ఇంట్లోకి కూడా పాములు గట్రా వచ్చినప్పుడు ఇలా రక్షించే ఒక కుక్క ఉంటే బాగుంటూ కదా అనిపిస్తుంది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఆ కుక్క ఎంత ధైర్యంగా ఆ ఇండియన్ కోబ్రాను తుకడాలు తుకడాలు చేసిందో అంటూ కామెంట్ చేస్తున్నారు. అయితే పామును ముక్కలు చేసిన ఆ కుక్క రోట్‌వీలర్ అనే జాతికి చెందింది. ఇవి చాలా దూకుడుగా ఉంటాయి. సాధారణంగా ఈ జాతి కుక్కలను పశువులకు కాపలాగా ఉంచుతుంటారు. చాలా మంది వీటికి భారీ ధర పెట్టి మరీ కొంటుంటారు. అయితే ఇండియాలో మాత్రం ఈ జాతి కుక్కలపై నిషేధం విధించారు. కొన్ని సార్లు ఇవి విక్షణా రహితంగా మనుషులపై దాడి చేస్తే ప్రాణాలు పోయే అవకాశం ఉండటంతో వీటిని పెంచుకోవడాన్ని బ్యాన్ చేశారు.
మొత్తం 23 రకాల ప్రమాదకరమైన కుక్క జాతులను ఇండియాలో బ్యాన్ చేశారు. అయితే ఈ వీడియో చూసిన కొంతమంది కుక్క యజమానికి మానవత్వం లేదని అంటున్నారు. పాము ఇంట్లోకి వచ్చింది నిజమే కానీ, దాన్ని పట్టించి ఊరికి దూరంగా వదిలేస్తే సరిపోతుంది కదా, ఇలా కుక్కతో చంపించాలా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కుక్క యజమాని ‘హిట్లర్ హిట్లర్’ అని అరుస్తూ కుక్క, పాముతో పోరాడకుండా ఆపుతున్నట్లు వీడియోలో కనిపిస్తుంది. కానీ అప్పటికే ఆ కుక్క పామును రెండు ముక్కలు చేసేసింది.
View this post on Instagram