Viral Video: స్విమ్మింగ్‌ఫూల్ పక్కన వాకింగ్ చేస్తూ ఫోన్ మాట్లాడుతున్నాడు.. అకస్మాత్తుగా ఏం జరిగిందంటే?
Trending Video: కాన్ఫరెన్స్ కాల్ సమయంలో ఒక వ్యక్తి నడుచుకుంటూ జారిపడి స్విమ్మింగ్ పూల్‌లో పడిబోయాడు. కానీ, ఆ తరువాత..
Viral Video: కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ కారణంగా, చాలా మంది ప్రజలు ఇంట్లో పని చేస్తున్నారు. ఇంటి నుంచి పని చేస్తున్నప్పుడు, చాలా సార్లు ప్రజలు కాల్ లేదా వీడియో కాల్ ద్వారా ఆఫీసుల మీటింగ్‌లకు హాజరవుతుంటుంటారు. ప్రస్తుతం, ఇలాంటి స్థితిలో ఎన్నో ఫన్నీ మూమెంట్స్ నెట్టింట్లో కనిపించాయి. వీటిలో చాలా వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఫోన్‌లో కాన్ఫరెన్స్ కాల్ సమయంలో ఇంటి పెరట్లో ఒక వ్యక్తి నడుచుకుంటూ వస్తున్నట్లు వీడియోలో చూడొచ్చు. ఆ వ్యక్తి నడుచుకుంటూ తన ఇంటి ఆవరణలో ఉన్న స్విమ్మింగ్ పూల్ దగ్గరకు చేరుకోవడం కూడా వీడియోలో కనిపిస్తుంది.
మాట్లాడుకుంటూ స్విమ్మింగ్ పూల్ వద్దకు చేరుకున్న వ్యక్తి జారిపడి ఒక్కసారిగా కిందపడిపోయాడు. అయితా వెంటనే తేరుకుని ఆ వ్యక్తి తన కాన్ఫరెన్స్ కాల్‌లో నిమగ్నమయ్యాడు. ప్రస్తుతం ఈ వీడియో చూసి సోషల్ మీడియా యూజర్లు చాలా ఆశ్చర్యపోతున్నారు. అదే సమయంలో, పని పట్ల వ్యక్తి అంకితభావాన్ని అభినందిస్తున్నారు.
ఈ వీడియోను ఆ వ్యక్తి కొడుకు సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఆ తర్వాత చాలా సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో షేర్ అయింది. ఈ వీడియో ఇంటి భద్రత కోసం అమర్చిన సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. వార్తలు రాసే సమయానికి ఈ వీడియోకు దాదాపు 10 లక్షల వ్యూస్ దాటాయి. అదే సమయంలో, 32 వేల మందికి పైగా వినియోగదారులు దీన్ని లైక్ చేశారు. కిందపడిపోయినా తన కాన్ఫరెన్స్ కాల్‌ను మాత్రం ఆపకుండా మాట్లాడుతుండడంతో అంతా పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.
View this post on Instagram
Viral Video: ఫుల్లుగా తాగి అర్ధరాత్రి పోలీసులకు ఫోన్ చేసిన ఘనుడు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..