Viral Video: పల్లీలు అమ్ముతూనే సెలబ్రేటీ అయ్యాడు… సోషల్ మీడియాలో దుమ్ము లేపుతున్న వీడియో..
Viral Video: సైకిలు తొక్కుతూ గ్రామాల్లో పల్లీలు అమ్ముకునే వ్యక్తి పాడిన ఓ పాట ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పశ్చిమ బెంగాల్‌లోని భీర్బూమ్‌కి చెందిన భూబన్ అనే పల్లీల వ్యాపారి కడు పేదవాడు. కనీసం కాళ్లకు చెప్పులు కూడా లేని
Viral Video: సైకిలు తొక్కుతూ గ్రామాల్లో పల్లీలు అమ్ముకునే వ్యక్తి పాడిన ఓ పాట ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పశ్చిమ బెంగాల్‌లోని భీర్బూమ్‌కి చెందిన భూబన్ అనే పల్లీల వ్యాపారి కడు పేదవాడు. కనీసం కాళ్లకు చెప్పులు కూడా లేని ఆయన రోజూలాగే పల్లీలు అమ్ముకుంటూ వెళ్తూ శనక్కాయలమీద ఓ పాట పాడాడు. అతను పాడిన విధానం నెటిజన్లకు బాగా నచ్చింది. బాదామ్ బాదామ్ కచ్చా బాదామ్ అంటూ సాగే ఆ పాటతో జనం తన పల్లీలు కొనుక్కునేలా చేస్తుంటాడు భూబన్. ఆ పాట విన్న ప్రజలు.. ఆయన టాలెంట్‌కు ముచ్చటపడి.. ఆనందంతో పల్లీలు కొంటారు. దాంతో ఆ పాట కాస్తా వైరల్ అయింది. అందులో ఓ రకమైన రిథమిక్ ఉందని నెటిజన్లు అంటున్నారు. కొంతమంది ఈ పాటపైన మాషప్స్ కూడా చేశారు. అవికూడా వైరల్ అవుతున్నాయి. పశ్చిమ బెంగాల్‌కి చెందిన గాయని రాణు మండల్ కూడా ఈ పాటను తనదైన శైలిలో పాడారు.
అయితే ఈ పాట పాడిన భూబన్.. పోలీసులకు ఫిర్యాదు చేసాడు. ఎందుకంటే తన పాటకు ఎంత పాపులార్టీ వచ్చినా.. దాని వల్ల తనకు ఎలాంటి ప్రయోజనమూ కలగలేదనీ.. ఇతరులు మాత్రం ప్రయోజనం పొందుతున్నారని కంప్లైంట్‌లో చెప్పినట్లు తెలిసింది. నిజమే మరి.. ఆయన స్వయంగా పాడిన పాటను సోషల్ మీడియాలో కొంతమంది రీమిక్సులూ, ఇతరత్రా చేసి బాగానే ఫేమ్ తెచ్చుకుంటున్నారు. మరి పాట పాడిన భూబన్‌కి కూడా మేలు చెయ్యాలి కదా. అది మాత్రం జరగట్లేదు. ఒక్క రూపాయి కూడా ఆయనకు చేరట్లేదు. పైగా.. తమపై కేసు పెడితే ఊరుకునేది లేదని కొంతమంది తనకే వార్నింగ్ ఇస్తున్నారని భూబన్ ఆవేదన వ్యక్తం చేసాడు.