Viral Video: అకస్మాత్తుగా నేలపై పడిన పక్షుల మంద.. వీడియో చూస్తే షాకవుతారు.. 5G ఎఫెక్ట్ అంటోన్న నెటిజన్లు?
ఉత్తర అమెరికా నుంచి షాకింగ్ వీడియో ఒకటి బయటకొచ్చింది. ఇక్కడ మెక్సికోలోని క్యూటెమోక్ నగరంలో పక్షుల గుంపు ఒక్కసారిగా ఆకాశం నుంచి నేలపై పడినట్లు ఈ వీడియోలో చూడొచ్చు. ఆ మందలో..
Viral Video: ఉత్తర అమెరికా నుంచి షాకింగ్ వీడియో ఒకటి బయటకొచ్చింది. ఇక్కడ మెక్సికోలోని క్యూటెమోక్ నగరంలో పక్షుల గుంపు ఒక్కసారిగా ఆకాశం నుంచి నేలపై పడినట్లు ఈ వీడియోలో చూడొచ్చు. ఆ మందలో పసుపు తలలున్న నల్లటి పక్షులు వందల సంఖ్యలో ఉన్నాయి. ఈ ఘటనలో చాలా పక్షులు చనిపోయాయి. ఫిబ్రవరి 7వ తేదీన జరిగిన ఈ సంఘటన ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరలవుతోంది(Trending). ట్విట్టర్(Twitter)లో 1.4 మిలియన్ కంటే ఎక్కువ సార్లు ఈ వీడియోకు వ్యూస్ వచ్చాయి. ఈ ఘటనకు కాలుష్యం, 5జీ టెక్నాలజీ, పవర్ కేబుల్స్ కారణమని పలువురు ఆరోపిస్తున్నారు. అయితే పక్షి నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఇతర పక్షుల మందతో యుద్దం కావొచ్చని పేర్కొన్నారు. అయితే ఇందుకు పెరెగ్రైన్ లేదా హాక్ వంటి పెద్ద పక్షి వాటిని వేటాడేందుకు ప్రయత్నించి ఉండొచ్చని అంటున్నారు. దీని కారణంగా పెద్ద సంఖ్యలో పక్షులు నేలమీద పడి మరణించాయి.
5G నెట్‌వర్క్.. 5G హోమ్ ఇంటర్నెట్ సర్వీస్ అక్టోబర్ 2018, USలో ప్రారంభించారు. ఈ హై-స్పీడ్ ఇంటర్నెట్ టెక్నాలజీని మొదటిసారిగా దక్షిణ కొరియాలో ఏప్రిల్ 2019లో ప్రారంభించారు. అప్పటి నుంచి మరో 26 దేశాలు ఇందులో చేరాయి. ప్రస్తుతం, 5Gకి 190 మిలియన్ల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. వీటిలో ఎక్కువ భాగం చైనా నుంచి వచ్చాయి. ఇక్కడ 5G అక్టోబర్ 2019లో ప్రారంభించారు.
ఇది స్మార్ట్‌ఫోన్‌తో పోలిస్తే అనేక రకాల పరికరాలను కనెక్ట్ చేసేలా రూపొందించబడింది. ఇది చాలా ఎక్కువ వేగం, సామర్థ్యాన్ని అందిస్తుంది. 5G 3 బ్యాండ్‌లలో పనిచేస్తుంది. అవి తక్కువ, మధ్య, అధిక-ఫ్రీక్వెన్సీ స్పెక్ట్రంలో పనిచేస్తుంది. తక్కువ బ్యాండ్ స్పెక్ట్రమ్‌లో వేగం 100 Mbps (సెకనుకు మెగాబిట్‌లు)కి పరిమితం. మిడ్-బ్యాండ్ స్పెక్ట్రం తక్కువ-బ్యాండ్ కంటే ఎక్కువ వేగాన్ని అందిస్తుంది.
అయితే, కవరేజ్ ప్రాంతం, సిగ్నల్‌కు పరిమితులు ఉన్నాయి. హై-బ్యాండ్ స్పెక్ట్రమ్‌లో, వేగం 20 Gbps (సెకనుకు గిగాబైట్‌లు)కి పడిపోతుంది. పక్షులతో ప్రమాదానికి 5G నిందించడం ఇదే మొదటిసారి కాదు.
భారతదేశంలో కూడా, 2021లో భారతదేశంలో బర్డ్ ఫ్లూ కారణంగా పక్షులు మరణించిన సందర్భాలు ఉన్నాయి. జియో 5G పరీక్ష కారణంగా పక్షులు చనిపోతున్నాయనే వార్తలు వినిపించాయి. ప్రస్తుతం మెక్సికోలో పక్షులతో ప్రమాదానికి 5G కారణం అంటూ నెట్టింట్లో ఉవ్వెత్తున ప్రచారం జరుగుతోంది.
Also Read: Viral Video: ఫొటోగ్రాఫర్‌పై పడగెత్తిన పాము..పరుగులంకించుకున్నా వదల్లేదు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..