AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బైకర్‏కు షాకిచ్చిన జిరాఫీ.. ఎదురుగా వచ్చి అలా చేసే సరికి ఖంగుతిన్న యువకుడు.. వీడియో వైరల్..

Viral Video:  సాధారణంగా మనుషులు కనిపిస్తే కొన్ని జంతువులు ప్రేమతో దగ్గరకు వస్తుంటాయి. ఇక అవి చేసే పనులను చూస్తే.. నవ్వులు పూయిస్తాయి.

బైకర్‏కు షాకిచ్చిన జిరాఫీ.. ఎదురుగా వచ్చి అలా చేసే సరికి ఖంగుతిన్న యువకుడు.. వీడియో వైరల్..
Viral Video Giraffe
Rajitha Chanti
|

Updated on: May 02, 2021 | 1:02 PM

Share

Viral Video:  సాధారణంగా మనుషులు కనిపిస్తే కొన్ని జంతువులు ప్రేమతో దగ్గరకు వస్తుంటాయి. ఇక అవి చేసే పనులను చూస్తే.. నవ్వులు పూయిస్తాయి. అలాగే మరికొన్ని సార్లు ఆశ్చర్యం కలుగుతుంటుంది. అయితే జిరాఫీలు మాత్రం ఎప్పుడూ మనుషుల దగ్గరకు వచ్చిన సందర్బాలు చాలా అరుదు. ఇక వాటిని దగ్గరి నుంచి చూడాలంటే మన తల మొత్తం పైకెత్తి చూడాల్సిందే. తాజాగా సోషల్ మీడియాలో ఓ జిరాఫీకి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. అందులో దారి వెంబడి వెళ్తున్న యువకుడికి అడ్డువచ్చి.. అది ప్రవర్తించిన తీరు చూస్తుంటే ఒకింత ఆశ్చర్యం కలగక మానదు.

దక్షిణాఫ్రికాకు చెందిన జోహన్నెస్ బర్గ్ కు చెందిన టిమ్మీ మోజర్ ఇటీవల లయన్ అండ్ సఫారి పార్కులో తన ప్రియురాలు టాజ్ స్క్రీవెన తో కలిసి మౌంటెన్ బైకింగ్ కోసం వెళ్ళాడు. వన్యప్రాణుల సంరక్షణ పరిసరాల చుట్టూ తిరుగుతునన అతనికి ఒక విచిత్రి సంఘటన ఎదురైంది. అందుకు సంబంధించిన వీడియోను అతను తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశాడు. “టాజ్ స్క్రీవెన్ తో కలిసి @lionandsafaripark పార్క్ లో తిరుగుతున్నప్పుడు మాకు ఎదురుగా ఒక జిరాఫీ వచ్చింది. అయితే వెంటనే ఆగిపోయాము. దాని ఆకారం చూసి మాకు భయం వేసింది. అందుకే నెమ్మదిగా వెనకకు వెళ్ళాడానికి ప్రయత్నించాను. కానీ అది నన్ను స్నిప్ చేస్తునే ఉంది. నాకు తెలిసి అది నన్ను చిన్న జిరాఫీ లాగా అనుకుంది. అందుకే నాతో అలా ప్రవర్తించింది” అంటూ ట్వీట్ చేశారు. ఇక ఈ వీడియోకు ఇప్పటివరకు పది మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. ఇక దీనిని చూసిన నెటిజన్లు తమదైన శైలీలో కామెంట్స్ చేస్తున్నారు.

ట్వీట్..

View this post on Instagram

A post shared by Timmy (@mosertimmy)

Also Read: అదిరిపోయే ఆప్షన్.. రోజుకు రూ.50 ఆదా చేస్తే.. రూ.50 లక్షలు మీ సొంతం.. ఎలాగో తెలుసుకుందామా..

PF ఖాతాదారులకు అలర్ట్.. ఉద్యోగం మారారా ? అయితే వెంటనే ఈ పని చేయండి.. లేదంటే…

PM Kisan: కరోనా కాలంలో రైతులకు గుడ్‏న్యూస్.. వారి ఖాతాల్లోకి ఒకేసారి రూ.7,500… ఎప్పుడంటే..

Follow Us