Delhi: ఢిల్లీలో ఎన్‌కౌంటర్ కలకలం ..  గ్యాంగ్‌స్టర్ల అరెస్ట్. ఇద్దరు పోలీసులకు గాయాలు

Delhi: ఢిల్లీలో ఎన్‌కౌంటర్ కలకలం .. గ్యాంగ్‌స్టర్ల అరెస్ట్. ఇద్దరు పోలీసులకు గాయాలు

Anil kumar poka

|

Updated on: Mar 14, 2024 | 3:45 PM

సోమవారం రాత్రి జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఢిల్లీ పోలీసులు ముగ్గురు కరుడుగట్టిన గ్యాంగ్‌స్టర్లను అరెస్ట్ చేశారు. హషీం ముఠాకు చెందిన ముగ్గురు సభ్యులు ఈ నెల 9న అర్బాజ్ అనే వ్యక్తిని కాల్చి చంపారు. నిందితుల కదలికలపై పక్కా సమాచారం అందుకున్న పోలీసులు వారిని పట్టుకునేందుకు మార్చి 11వ తేదీ రాత్రి 1.30 సమయంలో ఈశాన్య ఢిల్లీలోని అంబేద్కర్ కాలేజీ సమీపానికి వెళ్లారు.

సోమవారం రాత్రి జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఢిల్లీ పోలీసులు ముగ్గురు కరుడుగట్టిన గ్యాంగ్‌స్టర్లను అరెస్ట్ చేశారు. హషీం ముఠాకు చెందిన ముగ్గురు సభ్యులు ఈ నెల 9న అర్బాజ్ అనే వ్యక్తిని కాల్చి చంపారు. నిందితుల కదలికలపై పక్కా సమాచారం అందుకున్న పోలీసులు వారిని పట్టుకునేందుకు మార్చి 11వ తేదీ రాత్రి 1.30 సమయంలో ఈశాన్య ఢిల్లీలోని అంబేద్కర్ కాలేజీ సమీపానికి వెళ్లారు. వారిని గమనించిన గ్యాంగ్‌స్టర్లు కాల్పులకు తెగబడ్డారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఎదురుకాల్పులు ప్రారంభించారు. ఈ క్రమంలో దుండగుల కాళ్లకు గాయాలు కావడంతో కదల్లేకపోయారు. వెంటనే వారిని పట్టుకున్న పోలీసులు ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులు కూడా గాయపడినట్టు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.

ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.

‘నా భర్త VDలా ఉండాలి.!’ నో కన్ఫూజన్‌ తెలిసిన కాంబినేషనేగా..