Mission Bhagiratha: బెట్టింగ్‌కు బానిసై.. రూ.15 కోట్ల అప్పులు చేసిన మిషన్ భగీరథ ఏఈ.
కీసర మండలం మిషన్ భగీరథ అసిస్టెంట్ ఇంజినీర్ రాహుల్.. ఆన్‌లైన్ గేమ్స్, రమ్మీలాంటి పలు బెట్టింగ్ గేమ్స్‌లకు బానిసై సుమారు 15 కోట్ల రూపాయల వరకు అప్పులు చేశాడు. డబ్బుల చెల్లింపులకు తగిన పనులు ఇప్పిస్తానని నమ్మించి కాంట్రాక్టర్ల నుంచి భారీ మొత్తంలో డబ్బులు తీసుకొన్నాడు. అతని వ్యవహారం ఉన్నతాధికారులకు తెలిసి గుట్టుగా ఆరు నెలల క్రితం సస్పెండ్ చేశారు.
కీసర మండలం మిషన్ భగీరథ అసిస్టెంట్ ఇంజినీర్ రాహుల్.. ఆన్‌లైన్ గేమ్స్, రమ్మీలాంటి పలు బెట్టింగ్ గేమ్స్‌లకు బానిసై సుమారు 15 కోట్ల రూపాయల వరకు అప్పులు చేశాడు. డబ్బుల చెల్లింపులకు తగిన పనులు ఇప్పిస్తానని నమ్మించి కాంట్రాక్టర్ల నుంచి భారీ మొత్తంలో డబ్బులు తీసుకొన్నాడు. అతని వ్యవహారం ఉన్నతాధికారులకు తెలిసి గుట్టుగా ఆరు నెలల క్రితం సస్పెండ్ చేశారు. అతనికి సహకరించిన అదే శాఖలో పని చేసే ఓ అధికారిని సైతం సస్పెండ్ అయ్యాడు. మిషన్ భగీరథ ఏఈగా పని చేసే రాహుల్ కాంట్రాక్టర్లకు పనులు ఇప్పిస్తానని నమ్మించి దాదాపు 37 మంది నుంచి సుమారుగా 15 కోట్ల రూపాయలకు పైగా డబ్బులు తీసుకున్నాడు. బాధితులు అతనిపై ఇచ్చిన ఫిర్యాదు మేరకు గతంలో అతనిపై కీసర పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి లుక్ అవుట్ నోటీసు జారీ చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో గత కొన్ని నెలలుగా పరారీలో ఉన్న అతను సోమవారం పరాయి దేశం పారిపోతుండగా ఢిల్లీ విమానాశ్రయంలో పోలీసులకు దొరికిపోయాడు. అతన్ని సోమవారం రాత్రి కీసర పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చి విచారిస్తున్నారు. రాహుల్ భార్య, తల్లిదండ్రులు కూడా ప్రభుత్వ ఉద్యోగులే. వాళ్లు కొందరికి మాట ఇచ్చినా డబ్బు మాత్రం ఇవ్వడం లేదని బాధితులు పోలీసులకు తెలిపారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.
ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

