Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Elephant dance: ఏనుగులు ఈ రేంజ్‌లో డాన్స్‌ చేయడం ఎప్పుడూ చూసి ఉండరు..(వీడియో)

Elephant dance: ఏనుగులు ఈ రేంజ్‌లో డాన్స్‌ చేయడం ఎప్పుడూ చూసి ఉండరు..(వీడియో)

Anil kumar poka

|

Updated on: Oct 17, 2022 | 9:58 AM

ఓ ఏనుగు డాన్స్‌ చేసింది అంటే.. మీరేం ఊహించుకుంటారు.. ఆ.. ఏముందిలే.. తల ఊపుతూ.. తొండం అటూ ఇటూ కదుపుతుంది.. అనుకుంటారు.. కదా.. మరక్కడే మీరు తప్పులో కాలేస్తున్నారు.


వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో కొందరు ఓ తల్లి ఏనుగు, దాని పిల్ల ఏనుగును అందంగా అలంకరించి ఊరేగింపుగా తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలో ఆ చిన్నారి ఏనుగు దాని యజమాని ప్లే చేసిన పాటకు అదిరిపోయే స్టెప్పులేసింది. దాని ముందు తల్లి ఏనుగు కూడా చిన్నపాటి డన్స్‌ చేసింది కానీ.. ఈ గున్న ఏనుగు మాత్రం తనదైనశైలిలోఅదిరిపోయే స్టెప్పులతో అందరినీ ఆశ్చర్యంలో పడేసింది. ఏనుగులు ఇంతబాగా డాన్స్‌ చేస్తాయా.. అంటూ..డ్యాన్స్ చూసిన ప్రతి ఒక్కరూ ముగ్ధులైపోయారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టంటి తెగ వైరల్‌ అవుతుంది. అయితే ఈ వీడియో చూసిన కొందరు జంతు ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శిక్షకులు కొన్ని సందర్భాల్లో ఈ ఏనుగుల పట్ల క్రూరంగా వ్యవహరిస్తారని, ఇలాంటి వీడియోలకు మద్దతు ఇవ్వొద్దని కోరుతున్నారు. ‘‘జంతువులు ఉన్నది డ్యాన్స్ చేసి సంతోష పెట్టడానికి, మనుషుల కడుపు నింపడానికి కాదు. వాటిని సహజంగా బతకనివ్వండి. జంతువులను హింసించడాన్ని ఆపండి’’అంటూ ఓ యూజర్ తన కామెంట్‌లో కోరారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Army Dog: ఆర్మీ డాగా మజాకా..! రెండు బుల్లెట్లు దిగినా వెనుకడుగు వేయని ఆర్మీ డాగ్.. ఇద్దరు ముష్కరులు హతం.

woman death: “సమాధిలోకి వెళుతున్నా..చనిపోబోతున్నా..” అంటూ బామ్మ కలకలం..వీడియో

Woman paraded: దొంగ అరాచకం.. మహిళను వీధుల్లో నగ్నంగా తిప్పాడు.. నెట్టింట హల్ చల్ చేస్తున్న వీడియో.