Viral Video: జుట్టు పట్టుకుని కొట్టుకున్నారు.. తిట్టుకుంటూ తన్నుకున్నారు.. నడిరోడ్డుపై స్కూల్ విద్యార్థినుల రచ్చ
అంత వరకు ప్రశాంతంగా ఉన్న ఆ పాఠశాల ఎదుట ఉన్నపళంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. స్కూల్ ముందే 20 మందికి పైగా బాలికలు ఒకరినొకరు కొట్టుకున్నారు. కర్ణాటకలోని ఓ పాఠశాలకు చెందిన....
అంత వరకు ప్రశాంతంగా ఉన్న ఆ పాఠశాల ఎదుట ఉన్నపళంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. స్కూల్ ముందే 20 మందికి పైగా బాలికలు ఒకరినొకరు కొట్టుకున్నారు. కర్ణాటకలోని ఓ పాఠశాలకు చెందిన కొంతమంది బాలికలు రోడ్డుపై తగువులాడుకున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ విషయంపై రెండు వర్గాల విద్యార్థుల మధ్యం మాటామాటా పెరిగి ఈ ఘటనకు దారి తీసింది. దీంతో ఇరువర్గాల అమ్మాయిలు కోపంతో ఊగిపోతూ ఒకరినొకరు జుట్టు పట్టుకొని లాక్కున్నారు. గట్టిగా కేకలు వేస్తూ, కర్రలతో దాడిచేస్తూ తన్నుకున్నారు. ఈ ఘర్షణలో కొంతమంది అబ్బాయిలు కూడా ఉన్నట్లు కనిపిస్తోంది. గొడవ పడుతున్న బాలికలందరూ స్కూల్ యూనిఫాం వేసుకుని ఉన్నారు. అయితే ఏ విషయంలో ఇంతలా గొడవ పడ్డారనే విషయంపై సమాచారం తెలియాల్సి ఉంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతోంది.
An argument between students from Bishop cotton’s girls high school turned violent in Bengaluru’s St marks road as they came to blows & indulged in an all out street fight around 3pm yest. No case filed in the matter. School hasn’t issued any statement in this regard yet. pic.twitter.com/t8L1x5NMDY
— Deepak Bopanna (@dpkBopanna) May 18, 2022
ఇదీ చదవండి
Telangana: భర్త మానసిక స్థితి బాలేదు.. మామ ఏమో కామాంధుడు.. కోడలు ఏం చేసిందంటే.!