Ukraine Boy: హెలికాప్టర్ శబ్దం వినగానే ఇంటి నుంచి బయటకు చిన్నారి.. ఆ తర్వాత ఏం జరిగింది.?
ఉక్రెయిన్ రష్యా మధ్య రెండేళ్లుగా యుద్ధం కొనసాగుతోంది. అయితే ఉక్రెయిన్‌లో యుద్ధ ప్రాంతంలో నివసిస్తున్న ఓ బాలుడు.. ఉక్రెయిన్ ఆర్మీ హెలికాప్టర్లు శబ్దం వినగానే ఇంటి నుంచి బయటకు వచ్చి జెండా ఊపుతూ సైనికులకు తన మద్దతు తెలిపేవాడు. ఇలా కొంతకాలంగా కొనసాగిస్తూనే ఉన్నాడు. బాలుడి చేస్తున్న ఆ పని.. సైనికుల హృదయాలను హత్తుకుంది. అతడి ఉత్సాహాన్ని చూసి ఉప్పొంగిపోయిన సైనికులు..
ఉక్రెయిన్ రష్యా మధ్య రెండేళ్లుగా యుద్ధం కొనసాగుతోంది. అయితే ఉక్రెయిన్‌లో యుద్ధ ప్రాంతంలో నివసిస్తున్న ఓ బాలుడు.. ఉక్రెయిన్ ఆర్మీ హెలికాప్టర్లు శబ్దం వినగానే ఇంటి నుంచి బయటకు వచ్చి జెండా ఊపుతూ సైనికులకు తన మద్దతు తెలిపేవాడు. ఇలా కొంతకాలంగా కొనసాగిస్తూనే ఉన్నాడు. బాలుడి చేస్తున్న ఆ పని.. సైనికుల హృదయాలను హత్తుకుంది. అతడి ఉత్సాహాన్ని చూసి ఉప్పొంగిపోయిన సైనికులు.. ఎలాగైనా అతడిని కలవాలని నిర్ణయించుకున్నారు. అలా ఓ రోజు బాలుడు ఉంటున్న ప్రదేశానికి రెండు హెలికాప్టర్లు వచ్చాయి. కిందకు దిగిన ఓ హెలికాప్టర్ నుంచి బయటకు వచ్చిన ఓ సైనికుడు.. బాలుడి దగ్గరకు వెళ్లి స్వీట్లు, బొమ్మలు, ఆహారం అందించి కృతజ్ఞతలు తెలిపాడు.
పైనున్న మరో ఆర్మీ హెలికాప్టర్ చక్కర్లు కొడుతూ ఈ దృశ్యాలను చిత్రీకరించింది. వీటిని ఉక్రెయిన్ డిఫెన్స్ ఫోర్స్ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ రోజును ఆ బాలుడు ఎప్పటికీ గుర్తుంచుకుంటాడంటూ పేర్కొంది. సోషల్ మీడియా వేదికగా పంచుకున్న ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఉక్రెయిన్ జెండాను ఊపుతూ పరిగెడుతున్న బాలుడిని చూసి నెటిజన్లు కూడా మద్దతుగా స్పందిస్తున్నారు. ఇరు దేశాల మధ్య శాంతి నెలకొనాలని కోరుకుంటూ కామెంట్లు చేస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.
ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
మీ ఇంటికే మేడారం ప్రసాదం.. ఆర్టీసీ కొత్త ఆఫర్
పల్లె పడతులు వర్సెస్ పట్నం భామలు..సై అంటే సై..!
ఒడిశా గుహల్లో వెలుగుచూసిన ఆదిమానవుల ఆనవాళ్లు
వాషింగ్ మెషిన్ బ్లాస్ట్.. అసలు ఇది ఎలా జరిగిందంటే?
కదిలే కారులోకి దూసుకొచ్చిన అడవి మృగం..తల్లి ఒడిలోని చిన్నారి మృతి
600 ఏళ్ల నాటి వినాయక విగ్రహం లభ్యం

