Rajasthan: 17 మంది మనవళ్లు, మనుమరాళ్లకు ఒకేసారి పెళ్లి.! తాత ప్లాన్ అదుర్స్.
లాల్మదేసర్ గ్రామంలో గ్రామ పెద్దగా సూర్జారామ్ గోదారా ఉన్నారు. సూర్జారామ్ వారసులంతా ఉమ్మడి కుటుంబంగా నివసిస్తున్నారు. అయితే ఆ కుటుంబంలో పెళ్లికి ఎదిగిన సూర్జారామ్ మనుమళ్లు, మనుమరాళ్లు 17మంది ఉన్నారు. వీరందరికీ విడివిడిగా వివాహం జరిపించడం ఖర్చుతో కూడుకున్న పని అనుకున్నారో ఏమో కానీ, అందరికీ ఒకేసారి పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నారు.
రాజస్థాన్ బీకానేర్ జిల్లాలో ఓ వృద్ధుడు తన 17 మంది మనుమరాళ్ల, మనుమళ్ల పెళ్లి ఒకేసారి చేశారు. ఒక్క రోజు గ్యాప్‌లో వారి సామూహిక వివాహం జరిపించారు. వినడానికి విడ్డూరంగా ఉన్నా జరిగింది ఇదే. లాల్మదేసర్ గ్రామంలో గ్రామ పెద్దగా సూర్జారామ్ గోదారా ఉన్నారు. సూర్జారామ్ వారసులంతా ఉమ్మడి కుటుంబంగా నివసిస్తున్నారు. అయితే ఆ కుటుంబంలో పెళ్లికి ఎదిగిన సూర్జారామ్ మనుమళ్లు, మనుమరాళ్లు 17మంది ఉన్నారు. వీరందరికీ విడివిడిగా వివాహం జరిపించడం ఖర్చుతో కూడుకున్న పని అనుకున్నారో ఏమో కానీ, అందరికీ ఒకేసారి పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నారు. అనుకున్నట్లుగానే పక్కా ప్లాన్ వేసుకుని వారందరి పెళ్లిళ్లకు ఒకే ఆహ్వాన పత్రికను సిద్ధం చేశారు. అనంతరం బంధువులను పిలిచి ఐదుగురు మనుమళ్లకు సోమవారం ఏప్రిల్ 1వ తేదీన పెళ్లి చేశారు. మరుసటి రోజు 12మంది మనుమరాళ్లకు వివాహం జరిపించారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశం అయింది. ఇలా ఒకే ఇంట్లో సామూహిక వివాహాలు జరగడం ఈ ప్రాంతంలో ఇదే మొదటి సారి అని స్థానికులు మీడియాకు తెలిపారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.
ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

