Solar Eclipse: గ్రహణాలతో సంబంధం లేని ప్రదేశంలో ఇస్రో పంపిన ఆదిత్య ఎల్1 ఉపగ్రహం.

Solar Eclipse: గ్రహణాలతో సంబంధం లేని ప్రదేశంలో ఇస్రో పంపిన ఆదిత్య ఎల్1 ఉపగ్రహం.

Anil kumar poka

|

Updated on: Apr 10, 2024 | 8:07 AM

సూర్యుడిపై పరిశోధనల కోసం ఇస్రో ఇటీవల ‘ఆదిత్య ఎల్1’ శాటిలైట్‌ను పంపింది. సుదీర్ఘ ప్రయాణం తర్వాత లాగ్రాంజ్ పాయింట్ 1కు చేరుకున్న ఉపగ్రహం సూర్యడిపై పరిశోధనలు కొనసాగిస్తోంది. అయితే, ఇది నేటి సూర్యగ్రహణాన్ని మాత్రం అందుకోలే చతికిలబడింది. నేటి సంపూర్ణ సూర్యగ్రహణం మనకు కనిపించనప్పటికీ ఉత్తర అమెరికాలోని చాలా ప్రాంతాల్లో కనిపిస్తుంది.

సూర్యుడిపై పరిశోధనల కోసం ఇస్రో ఇటీవల ‘ఆదిత్య ఎల్1’ శాటిలైట్‌ను పంపింది. సుదీర్ఘ ప్రయాణం తర్వాత లాగ్రాంజ్ పాయింట్ 1కు చేరుకున్న ఉపగ్రహం సూర్యడిపై పరిశోధనలు కొనసాగిస్తోంది. అయితే, ఇది నేటి సూర్యగ్రహణాన్ని మాత్రం అందుకోలే చతికిలబడింది. నేటి సంపూర్ణ సూర్యగ్రహణం మనకు కనిపించనప్పటికీ ఉత్తర అమెరికాలోని చాలా ప్రాంతాల్లో కనిపిస్తుంది. ఈ అపురూప ఘట్టాన్ని కనులారా వీక్షించేందుకు స్కైడైవింగ్ నుంచి ప్రత్యేక విమానాల వరకు అనేక కార్యక్రమాలను యూఎస్‌లో నిర్వహిస్తున్నారు. దాదాపు ఒక శతాబ్దం తర్వాత తొలిసారి న్యూయార్క్ రాష్ట్రంలోని పశ్చిమ, ఉత్తర ప్రాంతాల్లో సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడుతోంది. సూర్యగ్రహణం సందర్భంగా అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా మరిన్ని పరిశోధనలకు రెడీ అయింది. ప్రత్యేక రీసెర్చ్ విమానాల ద్వారా ప్రయోగాలు చేపట్టింది. సూర్యగ్రహణం కొన్ని గంటలపాటు కొనసాగనున్న నేపథ్యంలో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని భావిస్తోంది. ఇది సంపూర్ణ సూర్యగ్రహణమే అయినప్పటికీ, కొన్ని గంటలపాటు ఇది కొనసాగే అవకాశం ఉన్నప్పటికీ పగలు రాత్రిగా మారే అద్భుత దృశ్యం మాత్రం నాలుగు నిమిషాల్లోనే ముగుస్తుంది.

భారత్ పంపిన ఆదిత్య ఎల్1 ఉపగ్రహం ఈ అపురూప ఘట్టానికి సాక్షిగా నిలవలేకపోతుంది. అయితే, ఇది ఇస్రో చేసిన తప్పు కాదు. దీని వెనక ఓ కారణం కూడా ఉంది. ఆదిత్య ఎల్1 ఉపగ్రహాన్ని ఇస్రో సూర్యుడిపై ప్రయోగాలకు ఎలాంటి ఆటంకం కలగని ప్రదేశంలో ఉంచింది. ఆదిత్య ఎల్1 అంతరిక్ష నౌక భూమి నుంచి 1.5 మిలియన్ కిలోమీటర్ల దూరంలో లాగ్రాంజ్ పాయింట్ 1 చుట్టూ ఒక హాలో కక్ష్యలో ప్రవేశపెట్టారు. ఇక్కడి నుంచి సూర్యుడిని నిరంతరం వీక్షించవచ్చు. గ్రహణాలు కూడా దీనికి అడ్డంరావు. దీనివల్ల సౌర కార్యకలాపాలను , అంతరిక్ష వాతావరణంపై దాని ప్రభావాన్ని వాస్తవ సమయంలో గమనించవచ్చు. ఆదిత్య ఎల్1 లాగ్రాంజ్ పాయింట్‌లో ఉంది కాబట్టే అది సూర్యగ్రహాన్ని ఒడిసిపట్టుకోలేకపోతుంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.

ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.

‘నా భర్త VDలా ఉండాలి.!’ నో కన్ఫూజన్‌ తెలిసిన కాంబినేషనేగా..