Dog on Owner: అన్నం పెట్టిన చేతిని కరిచే కుక్కలు కూడా ఉంటాయి.. యజమానిపై పెంపుడు కుక్క అవిశ్వాసం..
విశ్వాసానికి ఉదాహరణ చెప్పాలంటే.. ముందుగా గుర్తుకొచ్చేది శునకం. కుక్కకు ఉన్న విశ్వాసం మనిషికి కూడా ఉండదంటారు. మనుషులకు కుక్కలంటే అంత నమ్మకం. అంత అభిమానం. కానీ, కొలంబియాలోని దీనికి విరుద్ధంగా ప్రవర్తించింది. తనను పెంచి పోషిస్తున్న
విశ్వాసానికి ఉదాహరణ చెప్పాలంటే.. ముందుగా గుర్తుకొచ్చేది శునకం. కుక్కకు ఉన్న విశ్వాసం మనిషికి కూడా ఉండదంటారు. మనుషులకు కుక్కలంటే అంత నమ్మకం. అంత అభిమానం. కానీ, కొలంబియాలోని దీనికి విరుద్ధంగా ప్రవర్తించింది. తనను పెంచి పోషిస్తున్న యజమానిపైనే దాడికి పాల్పడింది. కిందపడి రక్తం కారుతున్నా వదల్లేదు. ఐదో ఫ్లోర్‌లో ఉన్న ఆ మహిళా యజమాని ఇతరుల సాయం కోసం లిఫ్ట్‌లో కిందికి వెళ్లేందుకు ప్రయత్నించింది. అయినా వదల్లేదు ఆ శునకం.. లిఫ్ట్‌లోనూ తన యజమానిని వెంటాడింది.ఈ ఘటన కొలంబియాలో జరిగింది. ప్రాడోస్ జిల్లాలో ఉన్న తన అపార్ట్‌మెంట్‌లో మహిళ షూలేస్‌ను కట్టుకుంటుంది. అంతే సడన్‌గా మహిలపై తన బ్లాక్ పిట్ బుల్ డాగ్ దాడిచేసింది. చుట్టుపక్కల ఎవరూ లేకపోవడంతో దానినుంచి తప్పించుకోడానికి ఆ మహిళ లిఫ్ట్ ఎక్కింది. ఆమెతోపాటే కుక్క కూడా లిఫ్ట్‌లోకి వచ్చేసింది. ఫస్ట్ ఫ్లోర్‌కు వచ్చేదాకా కరుస్తూనే ఉంది. ఆ మహిళ రక్తం కారుతుండగా లిఫ్ట్ బటన్ నొక్కుతూ కనిపించింది. లిఫ్ట్ డోర్ తెరుచుకోగానే కుక్కు కూడా ఆమె వెంటే వెళ్లింది. అయితే, బయట ఆ యజమాని బంధువు ఆమెను కుక్కనుంచి రక్షించాడు. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నదని మెట్రోపాలిటన్ పోలీసులు తెలిపారు. ఆమె చేతులకు తీవ్ర గాయాలయ్యాయని పేర్కొన్నారు. ఆ బ్లాక్ పిట్ బుల్ ఎందుకు అలా ప్రవర్తించిందో తెలుసుకోడానికి కుకుటాలోని జూనోసిస్ సెంటర్‌కు పంపామని తెలిపారు.
మరిన్ని చూడండి ఇక్కడ:
Chimpanzee video: తగ్గేదే లే..! ఎంజాయ్ మీకే కాదు మాకు ఉంటది.. గేమ్స్‌తో చిల్ అవుతున్న చింపు..
Funny Video: అట్లుంటది మనతోని మరి.. ఒంటెతో యువతి సెల్ఫీ.. ఆ ఒంటె ఏంచేసిందో చూస్తే నవ్వాపుకోలేరు..!
Queuing for condoms: కండోమ్స్ కోసం క్యూ కట్టిన జనం.. ఎందుకో తెలిస్తే షాకవ్వాల్సిందే !
Good News For Male: మగవారికి గుడ్‌న్యూస్.. ఆ ప్రయోగం సక్సెస్.. ఇంకేం భయంలేదు.. త్వరపడండి..