బుల్లెట్‌ ప్రూఫ్‌ జాకెట్‌లో కోతి.. పోలీసుల కాల్పుల్లో మృతి

మెక్సికోలో పోలీసులు, స్మగ్లర్లకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ క్రమంలో ఓ కోతి మరణించింది. ఈ బుల్లెట్‌ ప్రూఫ్‌ జాకెట్‌ ధరించి ఉంది ఆ కోతి. ఈ కోతిని చనిపోయిన

Phani CH

|

Jun 25, 2022 | 9:58 AM

మెక్సికోలో పోలీసులు, స్మగ్లర్లకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ క్రమంలో ఓ కోతి మరణించింది. ఈ బుల్లెట్‌ ప్రూఫ్‌ జాకెట్‌ ధరించి ఉంది ఆ కోతి. ఈ కోతిని చనిపోయిన స్మగ్లర్లలో ఓ వ్యక్తి పెంచుకుంటున్నట్లు గుర్తించారు పోలీసులు. మెక్సికోలో స్మగ్లర్లు తమ హోదాకు గుర్తుగా ఇలా జంతువులను పెంచుకోవడం సహజం. అలాగే ఈ స్మగ్లర్ల ముఠాకు చెందిన వ్యక్తి ఈ కోతిని పెంచుకున్నట్లు తెలుస్తోంది. ఈ ముఠాకు చెందిన అతడి వయసు 20ల్లోనే ఉంటుందని స్థానిక వార్తా సంస్థ తెలిపింది. పోలీసులు, స్మగ్లర్లకు మధ్య జరిగిన కాల్పుల్లో కోతికి, అతడి శరీరానికి కూడా బుల్లెట్లు తగిలాయని తెలిపింది. ఛాతిలో తూటా దిగడం వల్ల కోతి అక్కడికక్కడే మృతిచెందినట్లు స్పష్టం చేసింది. బుల్లెట్‌ ప్రూఫ్‌ జాకెట్‌ వేసుకున్న ఆ కోతి.. ప్రాణాలు కోల్పోయి నేల మీద పడి ఉన్న చిత్రాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. బుల్లెట్‌ గాయం వల్లే కోతి మరణించిందా? లేక ఇంకేదైనా కారణం ఉందా అన్నఅంశంపై పోలీసులు దృష్టి సారించారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

గుడ్లు పెడుతున్న బండ రాయి !! చూసేందుకు పరుగులు పెడుతున్న జనం

పుషప్స్‌ తో గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ బ్రేక్ చేసిన డానియల్‌ స్కాలీ !! గంటలో ఎన్ని పుషప్స్‌ చేశాడో తెలుసా ??

ఇదేం ఆత్రం రా బాబు.. బిల్డింగ్‌ ఇలా కూడా దిగుతారా ??

పట్టాలు దాటుతున్న వృద్దురాలు.. దూసుకొచ్చిన రైలు.. కట్ చేస్తే

కారును కబ్జా చేసిన పిల్లులు !! నెట్టింట నవ్వులు పువ్వులు పూయిస్తున్న వీడియో

 

 

Follow us on

Click on your DTH Provider to Add TV9 Telugu