Nature: నల్లమల అడవుల్లో అద్భుతమైన అందాలు.. మంచు పొగతో అందాల నీటి సోయగాలు ఫిదా.
నంద్యాల జిల్లాలోని నల్లమల అడవుల్లో అద్భుతమైన అందాలను వెదజల్లుతున్న జలపాతం చూసేందుకు రెండు కళ్ళు చాలడం లేదు. నిన్నటి వరకు వర్షాలు లేని జిల్లాలో ఒక్కసారిగా జలపాతం ఆవిష్కృతం అయ్యిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. బాహుబలి గ్రాఫిక్స్ వాటర్ ఫాల్స్‌ని మించి.. కనువిందు చేస్తోంది. మంచు పొగతో అందాల నీటి సోయగాలు ఫిదా చేస్తున్నాయి.
నంద్యాల జిల్లాలోని నల్లమల అడవుల్లో అద్భుతమైన అందాలను వెదజల్లుతున్న జలపాతం చూసేందుకు రెండు కళ్ళు చాలడం లేదు. నిన్నటి వరకు వర్షాలు లేని జిల్లాలో ఒక్కసారిగా జలపాతం ఆవిష్కృతం అయ్యిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. బాహుబలి గ్రాఫిక్స్ వాటర్ ఫాల్స్‌ని మించి.. కనువిందు చేస్తోంది. మంచు పొగతో అందాల నీటి సోయగాలు ఫిదా చేస్తున్నాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ఆత్మకూరు ఫారెస్ట్ డివిజన్ పరిధిలోని ఇందిరేశ్వరం గ్రామ సమీపంలోని గుమితం ఆలయం దగ్గరున్న నల్లమల వాటర్ ఫాల్స్ ఆకర్షిస్తోంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు వరద ప్రవహిస్తోంది. కాలువల గుండా హోయలు పోతూ.. కొండపై నుంచి జాలువారే శబ్దాలు కట్టిపడేస్తున్నాయి. అయితే ఈ ప్రాంతమంతా టైగర్ జోన్ కావడం… సాధారణంగా జులై, ఆగస్ట్, సెప్టెంబర్ నెలలు పులుల సంభోగ సమయం కావడంతో ఫారెస్ట్ అధికారులు పర్యటకుల్ని ఈ ప్రాంతాల్లోకి అనుమతించడం లేదు. దీంతో ఈ ప్రకృతి రమణీయకతను మిస్సవుతున్నామన్న బాద పర్యటకుల్లో కనిపిస్తోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...