పొలాల్లో కోతుల బెడదకు కొండముచ్చులతో చెక్‌

పొలాల్లో అడవి జంతువులనుంచి పంటను కాపాడుకోడానికి రైతులు రకరకాల పద్ధతులను అవలంభిస్తారు. ఇదివరకటి రోజుల్లో పొలాల్లో దిష్టిబొమ్మలను ఏర్పాటు చేసేవారు. లేదంటే పెద్ద శబ్ధాలు చేస్తూ కోతులు, అడవిపందులు లాంటి జంతువులను తరిమేసేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్‌ మారింది. రైతులు తమ పంటను కాపాడుకోడానికి పొలాల్లో సెలబ్రిటీల ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తున్నారు. తాజాగా ఓ రైతు తన పొలంలో కోతులను తరిమికొట్టడానికి అదేజాతికి చెందిన మరో జంతువు బొమ్మను ఎంచుకున్నాడు.

పొలాల్లో కోతుల బెడదకు కొండముచ్చులతో చెక్‌

|

Updated on: Feb 01, 2024 | 8:03 PM

పొలాల్లో అడవి జంతువులనుంచి పంటను కాపాడుకోడానికి రైతులు రకరకాల పద్ధతులను అవలంభిస్తారు. ఇదివరకటి రోజుల్లో పొలాల్లో దిష్టిబొమ్మలను ఏర్పాటు చేసేవారు. లేదంటే పెద్ద శబ్ధాలు చేస్తూ కోతులు, అడవిపందులు లాంటి జంతువులను తరిమేసేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్‌ మారింది. రైతులు తమ పంటను కాపాడుకోడానికి పొలాల్లో సెలబ్రిటీల ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తున్నారు. తాజాగా ఓ రైతు తన పొలంలో కోతులను తరిమికొట్టడానికి అదేజాతికి చెందిన మరో జంతువు బొమ్మను ఎంచుకున్నాడు. కోతులకు కొండముచ్చులంటే చచ్చేంత భయం. అందుకే ఈ రైతు కొండముచ్చును ఎంచుకున్నాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏజెన్సీలో రైతులు తమ పొలాల్లో కూరగాయలు, ఇతర పంటలను ధ్వంసం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా కోతుల ఆగడాలు తగ్గడంలేదని, ఆహారం, నీళ్లకోసం గ్రామాల్లోకి సైతం చొరబడుతున్నాయని, వాటిని తరిమికొట్టే ప్రయత్నంలో తమపై దాడులకు పాల్పడుతున్నాయని తెలిపారు. కోతుల కారణంగా కంటిమీద కునుకు ఉండటంలేదని, ఇటు ఇళ్లదగ్గర, అటు పొలాల్లోనూ కావలి కాయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కోతుల కారణంగా తీవ్రంగా నష్టపోతున్నామని తెలిపారు. ఈ క్రమంలో ఓ రైతు వినూత్నంగా ఆలోచించి కోతులను తరిమికొట్టేందుకు తన పొలంలో కొండముచ్చు ఫ్లెక్సీలను ఏర్పాటు చేశాడు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

“నా సీటు కింద బాంబు ఉంది” విమానంలో ప్రయాణికుడి కలకలం

Shruti Haasan: స్వాతంత్య్ర సమరయోధురాలి పాత్రలో శృతిహాసన్‌

ప్రపంచ అత్యంత సంపన్నుడుగా బెర్నార్డ్ ఆర్నాల్ట్ !! రెండో స్థానం లో ఎలాన్‌ మస్క్‌

అతి పెద్ద క్రూజ్‌ నౌకకు పేరు పెట్టిన ఫుట్‌బాల్‌ దిగ్గజం మెస్సీ

గ్యాస్‌ సిలిండర్‌లో గ్యాస్‌కు బదులు నీళ్లు !! ఎక్కడంటే ??

Follow us