అందుబాటులోకి వచ్చిన వేల ఏళ్లనాటి గుహలు !! వాల్మికి రామాయణం రాసిన చోటు ఇదేనా ??

నంద్యాల జిల్లాలో ఇటీవల వెలుగులోకి వచ్చిన వేల ఏళ్లనాటి అద్భుతమైన గుహలు ప్రజల సందర్శనార్థం అందుబాటులోకి వచ్చాయి. బేతంచెర్ల మండలంలో సహజసిద్ధంగా ఏర్పడిన వేల ఏళ్లనాటి బిలస్వర్గం గుహలు ఇన్నాళ్లూ ఎలాంటి అభివృద్ధికీ నోచుకోక నిష్ప్రయోజనంగా పడిఉన్నాయి. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌ ఆర్ధకశాఖమంత్రి బుగ్గన రాజేంద్రనాధ్‌ ఈ గుహలను సందర్శించారు. సహజసిద్ధమైన ఆ గుహలను 10 కోట్లతో అభివృద్ధి చేయించి పర్యాటక స్థలంగా తీర్చిదిద్దారు.

అందుబాటులోకి వచ్చిన వేల ఏళ్లనాటి గుహలు !! వాల్మికి రామాయణం రాసిన చోటు ఇదేనా ??

|

Updated on: Feb 01, 2024 | 8:04 PM

నంద్యాల జిల్లాలో ఇటీవల వెలుగులోకి వచ్చిన వేల ఏళ్లనాటి అద్భుతమైన గుహలు ప్రజల సందర్శనార్థం అందుబాటులోకి వచ్చాయి. బేతంచెర్ల మండలంలో సహజసిద్ధంగా ఏర్పడిన వేల ఏళ్లనాటి బిలస్వర్గం గుహలు ఇన్నాళ్లూ ఎలాంటి అభివృద్ధికీ నోచుకోక నిష్ప్రయోజనంగా పడిఉన్నాయి. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌ ఆర్ధకశాఖమంత్రి బుగ్గన రాజేంద్రనాధ్‌ ఈ గుహలను సందర్శించారు. సహజసిద్ధమైన ఆ గుహలను 10 కోట్లతో అభివృద్ధి చేయించి పర్యాటక స్థలంగా తీర్చిదిద్దారు. సర్వాంగ సుందరంగా ముస్తాబైన ఈ గుహలు జనవరి 29 నుంచి ప్రజల సందర్శనార్థం అందుబాటులోకి వచ్చాయి. మరోవైపు ప్యాపిలి మండలంలోని బోయవాళ్లపల్లి దగ్గర ఉన్న వాల్మీకి గుహలను సైతం అభివృద్ధి చేయించారు. ఎన్నో ఏళ్లుగా అభివృద్ధి చేయాలనే ప్రతిపాదనలు ఉన్నప్పటికీ కార్యరూపం దాల్చలేదు. మంత్రి బుగ్గన చొరవతో గుహల సహజత్వం కోల్పోకుండా వాటిని అభివృద్ధి చేయించారు. ఇప్పుడు ఈ గుహలు విద్యుత్‌ దీపాల అలంకరణలతో రారమ్మని పర్యాటకులను ఆహ్వానిస్తున్నాయి.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పొలాల్లో కోతుల బెడదకు కొండముచ్చులతో చెక్‌

Follow us