Sperm Extraction: భర్త వీర్యం భద్రపరచడానికి కోర్టు అనుమతి.! సంతానానికి ఉపయోగపడేలా..

|

Aug 25, 2024 | 1:11 PM

కేరళకు చెందిన ఓ మహిళ తన భర్త వీర్యాన్ని భద్రపరచడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా కేరళ హైకోర్టును ఆశ్రయించింది. కొద్ది కాలంగా తన భర్త తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నాడని, తమకు ఇప్పటి వరకు సంతానం లేదని ఆమె తెలిపింది. కాబట్టి భవిష్యత్తులో తాను సంతానాన్ని కనడానికి ఉపయోగపడేలా భర్త వీర్యాన్ని భద్రపరచడానికి అనుమతించాలని కోర్టును కోరింది. భర్త పరిస్థితి విషమంగా ఉండడం వల్ల అతడి రాతపూర్వక సమ్మతిని తీసుకురాలేకపోయానని అంది.

సంతానం లేని ఓ దంపతులు పిల్లలను కనడానికి చేసిన అభ్యర్థనకు కేరళ హైకోర్టు కీలకమైన తీర్పు ఇచ్చింది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న భర్త నుంచి వీర్యం సేకరించి, భద్రపరచడానికి అనుమతినిచ్చింది. కేరళకు చెందిన ఓ మహిళ తన భర్త వీర్యాన్ని భద్రపరచడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా కేరళ హైకోర్టును ఆశ్రయించింది. కొద్ది కాలంగా తన భర్త తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నాడని, తమకు ఇప్పటి వరకు సంతానం లేదని ఆమె తెలిపింది. కాబట్టి భవిష్యత్తులో తాను సంతానాన్ని కనడానికి ఉపయోగపడేలా భర్త వీర్యాన్ని భద్రపరచడానికి అనుమతించాలని కోర్టును కోరింది. భర్త పరిస్థితి విషమంగా ఉండడం వల్ల అతడి రాతపూర్వక సమ్మతిని తీసుకురాలేకపోయానని అంది. ఆలస్యం చేస్తే పరిస్థితి మరింత దిగజారి అతడు మరణించే ప్రమాదముందని.. వెంటనే తమకు న్యాయం చేయాలని న్యాయస్థానాన్ని అభ్యర్థించింది. అభ్యర్థనను స్వీకరించిన న్యాయమూర్తి జస్టిస్ వీజీ అరుణ్ ఆ దంపతులకు తాత్కాలిక ఉపశమనం కలిగించారు. భర్త నుంచి వీర్యం సేకరించి, భద్రపరచడానికి కోర్టు అనుమతిచ్చింది. దానికి మినహా మరే ఇతర ప్రక్రియలు చేపట్టవద్దని ఆంక్షలు విధించింది.

 

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.