IAF fighter Jet: యుద్ధ విమానం నుంచి జారిపడ్డ సామగ్రి.! పెద్ద శబ్దంతో పోఖ్రాన్‌లో పడ్డ వస్తువులు

IAF fighter Jet: యుద్ధ విమానం నుంచి జారిపడ్డ సామగ్రి.! పెద్ద శబ్దంతో పోఖ్రాన్‌లో పడ్డ వస్తువులు

Anil kumar poka

|

Updated on: Aug 25, 2024 | 2:22 PM

భారత వైమానిక దళానికి చెందిన యుద్ధవిమానం గగనతలంలో ఉండగా అనుకోని పరిస్థితి ఎదురైంది. అందులో నుంచి సామగ్రి జారిపడిందని సాంకేతిక లోపమే ఇందుకు కారణమని ఐఏఎఫ్ తెలిపింది. బుధవారం రాజస్థాన్‌ జైసల్మేర్‌ జిల్లాలోని పోఖ్రాన్ ఫైరింగ్ రేంజ్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఆ సామగ్రి జారిపడిన ప్రదేశం నిర్మానుష్యంగా ఉండటంతో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదని తెలిపింది.

భారత వైమానిక దళానికి చెందిన యుద్ధవిమానం గగనతలంలో ఉండగా అనుకోని పరిస్థితి ఎదురైంది. అందులో నుంచి సామగ్రి జారిపడిందని సాంకేతిక లోపమే ఇందుకు కారణమని ఐఏఎఫ్ తెలిపింది. బుధవారం రాజస్థాన్‌ జైసల్మేర్‌ జిల్లాలోని పోఖ్రాన్ ఫైరింగ్ రేంజ్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఆ సామగ్రి జారిపడిన ప్రదేశం నిర్మానుష్యంగా ఉండటంతో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదని తెలిపింది. దీనిపై ఐఏఎఫ్ విచారణకు ఆదేశించింది. అయితే పడిపోయిన ఆ సామగ్రి ఏంటో మాత్రం బయటపెట్టలేదు. ఎయిర్‌ స్టోర్ పడినప్పుడు పెద్ద శబ్దం వినిపించడంతో.. ఏం జరిగిందో తెలుసుకునేందుకు దగ్గర్లోని స్థానికులు అక్కడికి చేరుకున్నారు. అనంతరం అక్కడ ఏవో వస్తువుల ముక్కలు కనిపించినట్లు పోలీసులు తెలిపారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.