Breast Milk Jewellery: తల్లిపాలతో నగల తయారీ..! ఆర్డర్ల మీద ఆర్డర్లు.. ఈరోజుల్లో తల్లి పాల విలువ ఎంతమందికి తెలుసు..

Breast Milk Jewellery: తల్లిపాలతో నగల తయారీ..! ఆర్డర్ల మీద ఆర్డర్లు.. ఈరోజుల్లో తల్లి పాల విలువ ఎంతమందికి తెలుసు..

Anil kumar poka

|

Updated on: Apr 09, 2022 | 9:09 AM

నగలు అనేవి అందాన్ని మరింత పెంచేలా ఉంటాయి. చిన్నదైనా, పెద్దదైనా.. ఓ ఆభరణం ఒంటి మీద ధరిస్తే దానితో వచ్చే లుక్కే వేరు. అయితే, బంగారం, వెండితోనో కాకుండా,..ఇటీవల కాలంలో తల్లిపాలతో తయారు చేసిన ఆభరణాలు బాగా ఫేమస్‌ అవుతున్నాయి. తల్లి పాలను ఎవరూ మరచిపోకూడదని


నగలు అనేవి అందాన్ని మరింత పెంచేలా ఉంటాయి. చిన్నదైనా, పెద్దదైనా.. ఓ ఆభరణం ఒంటి మీద ధరిస్తే దానితో వచ్చే లుక్కే వేరు. అయితే, బంగారం, వెండితోనో కాకుండా,..ఇటీవల కాలంలో తల్లిపాలతో తయారు చేసిన ఆభరణాలు బాగా ఫేమస్‌ అవుతున్నాయి. తల్లి పాలను ఎవరూ మరచిపోకూడదని వాటితో ఆభరణాలు తయారు చేసిన మహిళ ప్రయత్నం ఫలించింది. ఆమె స్థాపించిన సంస్థ కూడా విజయవంతంగా సాగుతోంది. కోట్లల్లో వ్యాపారం కూడా జరుగుతుంది.లండన్‌కు చెందిన ఓ దంపతులు మెజెంటా ఫ్లవర్స్‌ అనే కంపెనీని స్థాపించారు. దీని ద్వారా త్లలిపాలతో ఉంగరాలు, బ్రేస్‌లెట్స్‌, ఇయర్‌ రింగ్స్‌ వంటివి తయారు చేస్తుంటారు. ఈ వ్యాపారంతో ప్రస్తుతం ఏడాదికి 15 కోట్ల రూపాయల మేర టర్నోవర్‌ సాధిస్తున్నామని సంస్థ నిర్వాహకులు తెలిపారు. ఇంతటి విలువైన ఆభరణాలుగా మార్చడానికి వినియోగదారులు కనీసం 30 మిల్లిలీటర్ల పాలను ఇవ్వాల్సి ఉంటుందన్నారు. తల్లిపాలను జీవితాంతం గుర్తుగ దాచుకోవాలనుకునేవారు పాలు ఇస్తే.. వాటితో కావాల్సిన ఆర్నమెంట్స్‌ తయారు చేసి ఇస్తారు.దీని కోసం ముందుగా తల్లిపాలను విలువైన రాళ్ల మాదిరి గట్టిగా మారుస్తారు. దీంతో పాలు అసలు రంగును కోల్పోకుండా ఉండేలా ఓ ఫార్ములాను అప్లై చేస్తారు. కొన్ని రకాల ద్రవ్యాలను కలిపి..ఆ రాళ్లు ఎక్కువ కాలం మెరుపు తగ్గకుండా ఉండేలా, అధిక నాణ్యత ఉండేలా చేస్తున్నారు. ఆ తర్వాత బంగారం, వెండితో తయారు చేసిన నగల్లో వీటిని పొదుగుతారు. ఇలా తల్లిపాలతో చేసిన ఆభరణాలతో తల్లి, బిడ్డల మధ్య ఉన్న బంధం మరింత బలపడుతుంది.

మరిన్ని చూడండి ఇక్కడ:

Chimpanzee video: తగ్గేదే లే..! ఎంజాయ్ మీకే కాదు మాకు ఉంటది.. గేమ్స్‌తో చిల్‌ అవుతున్న చింపు..

Funny Video: అట్లుంటది మనతోని మరి.. ఒంటెతో యువతి సెల్ఫీ.. ఆ ఒంటె ఏంచేసిందో చూస్తే నవ్వాపుకోలేరు..!

Viral Video: ఓరి దేవుడా..! ఒక అబ్బాయి కోసం జుట్లు పట్టుకొని పొట్టు పొట్టుగా కొట్టుకున్న అమ్మాయిలు.. వైరల్ అవుతున్న వీడియో..

Police Dance Viral Video: ఏంటి మేము ఎం అయినా తక్కువ..! కచ్చా బాదం సాంగ్‌కు.. డ్యాన్స్‌ ఇరగదీసిన పోలీసులు.!

Queuing for condoms: కండోమ్స్ కోసం క్యూ కట్టిన జనం.. ఎందుకో తెలిస్తే షాకవ్వాల్సిందే !

Viral Video: పిచ్చి వేషాలు వేస్తే అలాగే ఉంటది మరి… ప్రాంక్‌ చేయాలనుకున్నడు.. గూబ పగలకొట్టించుకున్నాడు..

Good News For Male: మగవారికి గుడ్‌న్యూస్.. ఆ ప్రయోగం సక్సెస్.. ఇంకేం భయంలేదు.. త్వరపడండి..

IPS Officer: అర్థరాత్రి సైకిల్‌పై లేడీ సింగం గస్తీ.! షాక్‌లో సీఎం స్టాలిన్‌..! వైరల్ అవుతున్న వీడియో..