Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Robot Snake: అంతరిక్షంలోకి రోబో స్నేక్‌.. భారత సంతతి ఇంజనీర్ ఆవిష్కరణ.

Robot Snake: అంతరిక్షంలోకి రోబో స్నేక్‌.. భారత సంతతి ఇంజనీర్ ఆవిష్కరణ.

Anil kumar poka

|

Updated on: Nov 15, 2023 | 8:59 PM

భారత సంతతికి చెందిన ఎందరో ప్రతిభావంతులు విదేశాల్లో విజయపథంలో దూసుకుపోతున్నారు. అందుకు మరో ఉదాహరణ ఈ ఘటన. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ఓ వినూత్న రోబోను పరీక్షిస్తోంది. పామును పోలి ఉండే ఈ రోబోను... చంద్రుడు, అంగారక గ్రహంపై పలు పరిశోధనల కోసం ఉపయోగించనున్నారు. భారత్‌లో కనిపించే కొండచిలువ ఆకారం, అది కదిలే తీరును స్ఫూర్తిగా తీసుకొని దీన్ని రూపొందించారు. భారత సంతతికి చెందిన ఓ ఇంజనీర్‌..

భారత సంతతికి చెందిన ఎందరో ప్రతిభావంతులు విదేశాల్లో విజయపథంలో దూసుకుపోతున్నారు. అందుకు మరో ఉదాహరణ ఈ ఘటన. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ఓ వినూత్న రోబోను పరీక్షిస్తోంది. పామును పోలి ఉండే ఈ రోబోను.. చంద్రుడు, అంగారక గ్రహంపై పలు పరిశోధనల కోసం ఉపయోగించనున్నారు. భారత్‌లో కనిపించే కొండచిలువ ఆకారం, అది కదిలే తీరును స్ఫూర్తిగా తీసుకొని దీన్ని రూపొందించారు. భారత సంతతికి చెందిన ఓ ఇంజనీర్‌ అద్బుతమైన ఆలోచన అమెరికాలో కార్యరూపం దాల్చుతోంది. నాగ్‌పూర్‌లో బీటెక్‌ మెకానికల్‌ ఇంజినీరింగ్‌ పూర్తి చేసిన రోహణ్‌ టక్కర్‌ నాసాలో జెట్‌ ప్రొపల్షన్‌ లేబోరేటరీ లో పనిచేస్తున్నారు. ఎగ్జోబయోలజీ ఎక్స్‌టంట్‌ లైఫ్‌ సర్వేయర్‌ పేరుతో పిలుస్తున్న ఈ పాము తరహా రోబో ఆలోచన ఈయనదే. ఎంతటి గరుకు ప్రదేశాల్లోనైనా దూసుకుపోయే సామర్థ్యం EELS కు ఉందని ప్రముఖ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రోహణ్‌ వెల్లడించారు. పగుళ్లు, గుహలు చివరకు నీటి లోపల కూడా ఇది ప్రయాణించగలదని తెలిపారు. ఇతర గ్రహాలపై జీవాన్వేషణలో ఇది తోడ్పడుతుందన్నారు. ఈ రోబో పామును ఇప్పటికే కృత్రిమంగా తయారు చేసిన.. కొండ ప్రదేశాలు, మంచు కొండలపై పరీక్షించినట్లు రోహణ్‌ తెలిపారు. ఈ రోబో పామును విపత్తుల సమయంలో సహాయ కార్యక్రమాల్లోనూ ఉపయోగించుకోవచ్చని వివరించారు. టక్కర్‌… నాగ్‌పూర్‌లోని విశ్వేశ్వరయ్య నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో మెకానికల్‌ ఇంజినీరింగ్ పూర్తి చేశారు. నాసా కోసం మార్షియన్‌ హెలికాప్టర్‌ను రూపొందించిన ఐఐటీయన్‌ బాబ్‌ బలరాం నుంచి తాను స్ఫూర్తి పొందినట్లు తెలిపారు. ఐఐటీలో సీటు కూడా సాధించలేకపోయినా తాను ఎంతో కష్టపడి నాసాలో పనిచేసే అవకాశాన్ని సొంతం చేసుకున్నానని తెలిపారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇటీవల విజయవంతంగా చేపట్టిన చంద్రయాన్‌-3 మిషన్‌పై రోహణ్‌ సంతోషం వ్యక్తం చేశారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.