Viral Video: ఈ కుక్కచేసిన పనికి హ్యాట్సాఫ్ అనాల్సిందే.. ఇంటి ఆవరణంలో అనుకుని అతిధిపై..
మధ్యప్రదేశ్‌లోని శివపురిలో రాత్రిపూట మొసళ్లు తిరగడం సాధారమైపోయింది. బంగంగా ప్రాంతంలో అర్థరాత్రి ఒక పెద్ద మొసలి ఓం ప్రకాష్ రజక్ అనే వ్యక్తి ఇంటి ఆవరణలోకి ప్రవేశించింది. కొంచెం ఆలస్యమైతే ఇంట్లోకి ప్రవేశించి ఎవరిపైన అయినా దాడి చేసి ఉండేది. అప్పటికే ఆ మొసలిని గమనించిన ఆ ఇంట్లోని పెంపుడు కుక్క అందరిని అలెర్ట్ చేస్తూ గట్టిగా అరిచింది. కుక్క అరుపులు విన్న ఇంటియజమాని ఎవరో దొంగలు ఇంట్లోకి చొరబడ్డారని అనుకున్నాడు.
విశ్వాసంలో కుక్కకు మించిన జీవి మరొకటి ఉండదంటే అతిశయోక్తి కాదు. అలాంటి ఎన్నో సంఘటనలు మనం చూసాం కూడా. ఇటీవల ఇంటర్నెట్ సౌకర్యం పెరిగిన తర్వాత అలాంటి కంటెంట్ తరచూ వైరల్ అవుతూ ఉంది. తాజాగా ఓ కుక్క చేసిన సాహసానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. మొసలి బారిన పడిన తన యజమానిని ప్రాణాలకు తెగించి కాపాడుకుంది. ఆ వీడియో చూసిన నెటిజన్లు ఆ కుక్కసాహసానికి హ్యాట్సాఫ్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లో చోటు చేసుకుంది. మధ్యప్రదేశ్‌లోని శివపురిలో రాత్రిపూట మొసళ్లు తిరగడం సాధారమైపోయింది. బంగంగా ప్రాంతంలో అర్థరాత్రి ఒక పెద్ద మొసలి ఓం ప్రకాష్ రజక్ అనే వ్యక్తి ఇంటి ఆవరణలోకి ప్రవేశించింది. కొంచెం ఆలస్యమైతే ఇంట్లోకి ప్రవేశించి ఎవరిపైన అయినా దాడి చేసి ఉండేది. అప్పటికే ఆ మొసలిని గమనించిన ఆ ఇంట్లోని పెంపుడు కుక్క అందరిని అలెర్ట్ చేస్తూ గట్టిగా అరిచింది. కుక్క అరుపులు విన్న ఇంటియజమాని ఎవరో దొంగలు ఇంట్లోకి చొరబడ్డారని అనుకున్నాడు. కానీ కుక్క అతన్ని మొసలి ఉన్న ప్రదేశానికి తీసుకెళ్లింది. అది చూసి అతను షాకయ్యాడు. వెంటనే నేషనల్ పార్క్ రెస్క్యూ టీమ్‌కి సమాచారం అందించాడు. రెస్క్యూ టీమ్ రావడానికి ఆలస్యం అవుతుండటంతో ఓంప్రకాష్ తన కుటుంబ సభ్యులతో కలిసి మొసలిని పట్టుకోవడానికి ప్రయత్నించాడు. సుమారు గంటన్నరపాటు శ్రమించి తాడుతో మొసలిని పట్టుకుని, గోనె సంచిలో వేసి ఖాళీ వాటర్ ట్యాంక్‌లో మొసలిని బంధించారు. రాత్రంతా కాపలా కాస్తూ రెస్క్యూ టీం కోసం ఎదురుచూశారు. ఉదయం నేషనల్ పార్క్ రెస్క్యూ టీమ్ రాగానే ఓంప్రకాష్ మొసలిని అటవీ అధికారులకు అప్పగించాడు. ఓంప్రకాష్ మాట్లాడుతూ తన పెంపుడు కుక్క కారణంగా పెను ప్రమాదం తప్పిందని, లేకపోతే మొసలి ఇంట్లో చొరబడి తమపై దాడి చేసేదని తెలిపాడు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...