Kambam Lake : ఆసియా ఖండంలోనే అతిపెద్ద చెరువు.. చెరువులో ఇప్పుడు ఎటు చూసినా నీళ్లే.
15వ శతాబ్దంలో గుండ్లకమ్మ నదిపై శ్రీకృష్ణ దేవరాయల కాలంలో కంభం చెరువును నిర్మించారు. ఆసియా ఖండంలోనే మానవ నిర్మితమైన చెరువుల్లో అతిపెద్దది. కంభం చెరువు 23.95 కిలోమీటర్ల పరిధిలో విస్తరించింది. 3 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం కలిగి చెరువు కాస్తా.. పూడిక కారణంగా 2 టీఎంసీలకే పరిమితమైంది. ఇటీవలె ప్రపంచ చారిత్రక వారసత్వ సాగునీటి నిర్మాణాల జాబితాలో చేరుస్తున్నట్లు ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజే సంస్థ అధికారికంగా ప్రకటించింది.
ఆసియా ఖండంలోనే అతిపెద్ద చెరువుల్లో రెండవదైన కంభం చెరువుకు వరద నీరు పోటెత్తింది. గత కొన్ని రోజులుగా నల్లమల అటవీ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రకాశం జిల్లాలోని కంభం చెరువు జలకళ సంతరించుకుంది. నిండుకుండలా మారిన చెరువుకు సందర్శకుల తాకిడి పెరిగింది. నీటి నిలువలు అడుగంటుతున్న సమయంలో.. చెరువులో నీటిమట్టం పెరగడంతో ఆయకట్టు రైతులు సంబరపడుతున్నారు. 15వ శతాబ్దంలో గుండ్లకమ్మ నదిపై శ్రీకృష్ణ దేవరాయల కాలంలో కంభం చెరువును నిర్మించారు. ఆసియా ఖండంలోనే మానవ నిర్మితమైన చెరువుల్లో అతిపెద్దది. కంభం చెరువు 23.95 కిలోమీటర్ల పరిధిలో విస్తరించింది. 3 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం కలిగి చెరువు కాస్తా.. పూడిక కారణంగా 2 టీఎంసీలకే పరిమితమైంది. ఇటీవలె ప్రపంచ చారిత్రక వారసత్వ సాగునీటి నిర్మాణాల జాబితాలో చేరుస్తున్నట్లు ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజే సంస్థ అధికారికంగా ప్రకటించింది. పేరుకు చెరువే కానీ.. ఇది ఓ పెద్ద ఆనకట్ట. కంభం చుట్టుపక్కల మెట్ట ప్రాంత రైతులకు ఈ చెరువు నీరే వరప్రదాయినీ. చెరువు పూర్తి నీటి సామర్థ్యంతో ఉంటే.. చుట్టుపక్కల ఉన్న కంభం, బెస్తవారి పేట, అర్థవీడు మండలాల్లో అధికారికంగా 19 గ్రామాల్లోని 10 వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది. 2 లక్షల జనాభాకు తాగునీరు అందిస్తుంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...