ATM theft: ఏటీఎంలో చోరీ.. ఈ దొంగల తెలివి మామూలుగా లేదుగా.. చూస్తే షాక్ అవ్వాల్సిందే.

ATM theft: ఏటీఎంలో చోరీ.. ఈ దొంగల తెలివి మామూలుగా లేదుగా.. చూస్తే షాక్ అవ్వాల్సిందే.

Anil kumar poka

|

Updated on: Aug 07, 2023 | 9:14 AM

పక్కా ప్లాన్‌తో ఏటీఎం చోరీకి రెడీ అయ్యారు. వ్యాన్ లో అర్ధరాత్రి ఏటీఎం వద్దకు చేరుకున్న దొంగలు ముసుగులు ధరించి లోపలికి ప్రవేశించారు. వారు సీసీ కెమెరాల్లో కనిపించకుండా ఉండేందుకు ముందుగా వాటిపై బ్లాక్‌ కలర్‌ స్ప్రే చేశారు. ఏటీఎం అద్దాలను గడ్డపారలతో పగులగోట్టి లోపలికి ప్రవేశించినట్లుగా పోలీసులు గుర్తించారు. గ్యాస్ కట్టర్ల సహాయంతో ఏటీఎం ను కట్ చేసి డబ్బులు చోరీ చేశారు.

ఇటీవల దొంగలు ఏటీఎంలే టార్గెట్‌గా బాగా రెచ్చిపోతున్నారు. ఏటీఎంలు పగలగొట్టి క్యాష్‌ కొట్టేయడమో, అది కుదరని పక్షంలో ఏటీఎంలు ఎత్తుకెళ్లిపోవడమో చేస్తున్నారు. అంతేకాదు ఏటీఎం ఓపెన్‌ చేయడం సాధ్యం కాకపోతే అందులో ఏర్పాటు చేసిన ఏసీలను ఎత్తుకెళ్లిపోతున్నారు. తాజాగా నల్లగొండ జిల్లా కట్టంగూరు మండలం ఐటిపాములలో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిని ఆనుకొని ప్రజా అవసరాల కోసం ఎస్‌బీఐ ఏటీఎంను ఏర్పాటు చేసింది. ఈ సెంటర్ లో రెండు ఏటీఎం యంత్రాలు ఏర్పాటు చేశారు. దొంగలు ఈ ఏటీఎంపై కన్నేశారు. పక్కా ప్లాన్‌తో ఏటీఎం చోరీకి రెడీ అయ్యారు. వ్యాన్ లో అర్ధరాత్రి ఏటీఎం వద్దకు చేరుకున్న దొంగలు ముసుగులు ధరించి లోపలికి ప్రవేశించారు. వారు సీసీ కెమెరాల్లో కనిపించకుండా ఉండేందుకు ముందుగా వాటిపై బ్లాక్‌ కలర్‌ స్ప్రే చేశారు. ఏటీఎం అద్దాలను గడ్డపారలతో పగులగోట్టి లోపలికి ప్రవేశించినట్లుగా పోలీసులు గుర్తించారు. గ్యాస్ కట్టర్ల సహాయంతో ఏటీఎం ను కట్ చేసి డబ్బులు చోరీ చేశారు. రెండు ఏటీఎంలో కలిపి 30 లక్షల రూపాయలు చోరీ జరిగినట్లు బ్యాంక్ అధికారులు చెబుతున్నారు. బ్యాంకు మేనేజర్ వీరబాబు ఫిర్యాదుతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని సీసీ ఫుటేజ్ లను పరిశీలించారు. ఈ చోరీకి ముగ్గురు దుండగులు పాల్పడినట్లు సీసీ కెమెరాలు రికార్డు అయిందని పోలీసులు చెబుతున్నారు. ఇదే మాదిరిగా 8 నెలల క్రితం కేతేపల్లి ఏటీఎంలో కూడా చోరీ జరిగినట్లుగా పోలీసులు చెబుతున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌...