Gold Seized: వాష్ బెసిన్‌లో కిలోన్నర బంగారం.. ఇలాంటి రవాణా ఎప్పుడూ చూసిండరు..

Gold Seized: వాష్ బెసిన్‌లో కిలోన్నర బంగారం.. ఇలాంటి రవాణా ఎప్పుడూ చూసిండరు..

Anil kumar poka

|

Updated on: Aug 06, 2023 | 9:43 PM

కస్టమ్ అధికారలు తనిఖీలో భాగంగా సీసీ కెమెరాలను పరిశీలించారు. ప్రయాణికుల కదలికలపై నిఘా పెట్టిన అధికారులు.. బాత్రూమ్‌లో పడేసిన బంగారాన్ని తరలిస్తున్న వ్యక్తిని గుర్తించారు. వెంటనే హైదరాబాద్ ఎయిర్ పోర్టు అధికారులకు సమాచారమిచ్చారు. దీంతో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో అతని అదుపులోకి తీసుకున్న కస్టమ్స్ అధికారులు బంగారం స్వాధీనం చేసుకున్నారు.

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో మరోసారి భారీగా బంగారం పట్టుబడింది. కస్టమ్స్‌ అధికారుల తనిఖీని తప్పించుకునేందుకు యత్నించి.. అడ్డంగా బుక్కయ్యాడు. దుబాయ్‌ నుంచి చెన్నై మీదుగా శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు విమానం వచ్చింది. ఆ విమానంలో వచ్చిన ప్రయాణికులను చెన్నైలో కస్టమ్స్‌ అధికారులు తనిఖీ చేపట్టారు. ఇది గమనించిన ఓ ప్రయాణికుడు తన వద్ద ఉన్న 1,329 గ్రాముల బంగారాన్ని వాష్ బెసన్‌లో పడేశాడు. దాన్ని మరో ప్రయాణికుడు హైదరాబాద్‌కు తరలించేందుకు ప్రయత్నంచి అడ్డంగా దొరికిపోయాడు. కస్టమ్ అధికారలు తనిఖీలో భాగంగా సీసీ కెమెరాలను పరిశీలించారు. ప్రయాణికుల కదలికలపై నిఘా పెట్టిన అధికారులు.. బాత్రూమ్‌లో పడేసిన బంగారాన్ని తరలిస్తున్న వ్యక్తిని గుర్తించారు. వెంటనే హైదరాబాద్ ఎయిర్ పోర్టు అధికారులకు సమాచారమిచ్చారు. దీంతో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో అతని అదుపులోకి తీసుకున్న కస్టమ్స్ అధికారులు బంగారం స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ బంగారం విలువ 81 లక్షల రూపాయలు ఉంటుందని కస్టమ్స్ అధికారులు అంచనా వేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌...