కివి పండ్లు ఆరోగ్యానికి ఎంతో మంచివి. ఇవి పోషకాలతో నిండి ఉంటాయి మరియు డెంగ్యూ వంటి వ్యాధుల సమయంలో ప్లేట్లెట్లను పెంచడంలో సహాయపడతాయి. అంతేకాకుండా, కివి పండ్లలోని యాంటీ ఆక్సిడెంట్లు మరియు సెరిటోనిన్ నిద్రను మెరుగుపరుస్తాయి. నిద్రలేమితో బాధపడేవారు రాత్రికి రెండు కివి పండ్లు తినడం వల్ల మెరుగైన నిద్ర పొందవచ్చు.