Tirumala: తిరుమల నడకమార్గంలో లక్షితపై దాడి చేసిన చిరుత గుర్తింపు.!

తిరుమల నడక మార్గంలో లక్షితపై దాడి చేసిన చిరుత గుర్తించిన అటవీశాఖ అధికారులు. శ్రీ వెంకటేశ్వర జూ పార్కుకు తరలిస్తున్నారు. తిరుమల అనగానే అధ్యాత్మిక భావన ఉట్టిపడుతుంది. ఏడాదిలో ఒక్కసారైనా వేంకటేశ్వరుని దర్శనం కోసం బారులు తీరుతారు భక్తులు. అలాంటి తిరుమల కొండపై ఈ మధ్య కాలంలో చిరుతల సంచారం భక్తులను కలవరపెడుతోంది. ముఖ్యంగా కాలినడక మార్గంలో నడుచుకుంటూ వెళ్లే భక్తులు బిక్కుబిక్కుమని వెళ్లాల్సిన పరిస్థితి.

Tirumala: తిరుమల నడకమార్గంలో లక్షితపై దాడి చేసిన చిరుత గుర్తింపు.!

|

Updated on: Mar 21, 2024 | 9:17 AM

తిరుమల నడక మార్గంలో లక్షితపై దాడి చేసిన చిరుత గుర్తించిన అటవీశాఖ అధికారులు. శ్రీ వెంకటేశ్వర జూ పార్కుకు తరలిస్తున్నారు. తిరుమల అనగానే అధ్యాత్మిక భావన ఉట్టిపడుతుంది. ఏడాదిలో ఒక్కసారైనా వేంకటేశ్వరుని దర్శనం కోసం బారులు తీరుతారు భక్తులు. అలాంటి తిరుమల కొండపై ఈ మధ్య కాలంలో చిరుతల సంచారం భక్తులను కలవరపెడుతోంది. ముఖ్యంగా కాలినడక మార్గంలో నడుచుకుంటూ వెళ్లే భక్తులు బిక్కుబిక్కుమని వెళ్లాల్సిన పరిస్థితి. అయితే వీటిని గుర్తించడం కోసం టీటీడీ సిబ్బంది, అటవీ శాఖ అధికారులు సంయుక్తంగా ట్రాప్ కెమెరాలను అమర్చారు. ఇప్పటికే ఆపరేషన్ చిరుత లో భాగంగా 6 చిరుతలను బంధించింది అటవీ శాఖ. గతంలో లక్షిత అనే బాలికపై దాడి చేసి చంపిన చిరుతను దాదాపు 7 నెలల తర్వాత గుర్తించారు అటవీ శాఖ అధికారులు. గతేడాది ఆగస్టులో నడక మార్గంలోని ఎన్ఎస్ టెంపుల్ వద్ద లక్షితను పొట్టన పెట్టుకున్న చిరుతను గుర్తించారు. గత ఏడాది ఆగస్టు 11న రాత్రి 7.30 గంటల సమయంలో నరకమార్గంలోని ఏడో మైలు వద్ద ఆరేళ్ల లక్షిత అనే పాపపై చిరుత దాడి చేసి చంపింది. నెల్లూరు జిల్లా కోవూరు మండలం పోతిరెడ్డి పాలెం చెందిన దినేష్ శశికళ దంపతుల కూమార్తె లక్షితగా గుర్తించారు. ఈ ఘటనపై అప్పట్లో తిరుమల టూ టౌన్ పిఎస్‎లో కేసు నమోదైంది.

నడక మార్గంలో ఆపరేషన్ చిరుత ప్రారంభించిన టీటీడీ, అటవీశాఖ సిబ్బంది ఇప్పటికే 6 చిరుతలను బంధించారు. లక్షితపై దాడి చేసిన చిరుతను గుర్తించేందుకు నమూనాలు సేకరించి ల్యాబ్‎కు పంపారు అధికారులు. ఇలా ట్రాప్ కెమెరాలు బోన్లలో పట్టుబడ్డ మూడు చిరుతుల్లో ఒకటి విశాఖ జూ కు, రెండింటిని దట్టమైన అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు అధికారులు. మిగతా 3 చిరుతలను తిరుపతి జూపార్క్ లోనే ఉంచి నమూనాలను ల్యాబ్ కు పంపి పరిశీలిస్తున్నారు. ల్యాబ్ నుంచి వచ్చిన రిపోర్టు ఆధారంగా 4వ చిరుత లక్షితను చంపినట్టు నిర్ధారణ అయింది. మ్యాన్ ఈటర్‎గా భావించి తిరుపతి జూలోనే చిరుతను ఉంచాలని నిర్ణయం తీసుకున్నారు. లక్షితను చంపిన చిరుతకు జంతువులను వేటాడి తినే పరిస్థితి లేదని, నాలుగు కోరపళ్ళు రాలిపోయాయని గుర్తించారు. ఈ అంశాల ఆధారంగానే చిరుతకు జూపార్క్ లోనే షెల్టర్ ఇచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.

ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.

‘నా భర్త VDలా ఉండాలి.!’ నో కన్ఫూజన్‌ తెలిసిన కాంబినేషనేగా..

Follow us