AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hen and Dog: కుక్కతో కోడి దొంగాట! దోబూచులాటల్లో ఇదే బెస్ట్ అంటున్న ఇంటర్నెట్ జనాలు.. Viral Video

సాధారణంగా మనం ఇళ్లదగ్గర పెంచుకునే జంతువులూ, పక్షులూ వేరే జాతులవి అయినా అవి కలిసి మెలిసి పెరగడం వల్ల ఒక దానితో ఒకటి భలే ఆడుకుంటూ ఉంటాయి. వాటికీ టైం పాస్ కావాలి కదా.

Hen and Dog: కుక్కతో కోడి దొంగాట! దోబూచులాటల్లో ఇదే బెస్ట్ అంటున్న ఇంటర్నెట్ జనాలు.. Viral Video
Hen And Dog
KVD Varma
|

Updated on: Apr 27, 2021 | 8:43 PM

Share

Hen and Dog:  సాధారణంగా మనం ఇళ్లదగ్గర పెంచుకునే జంతువులూ, పక్షులూ వేరే జాతులవి అయినా అవి కలిసి మెలిసి పెరగడం వల్ల ఒక దానితో ఒకటి భలే ఆడుకుంటూ ఉంటాయి. వాటికీ టైం పాస్ కావాలి కదా. అందుకేనేమో ఒక్కోసారి తెగ ఆడతాయి. ఇలా పెంపుడు జంతువుల మధ్య జరిగే చిన్న చిన్న ఆటలు చూడటానికి భలే సరదా పుట్టిస్తాయి. ఎక్కువగా మనం పెంచుకునే కుక్క పిల్లలు చేసే విన్యాసాలు చూసి ఆనందిస్తూ ఉంటాం. ఒక్కోసారి ఇతర పెట్స్ కూడా వాటితో జతకూడితే అది భలే ఉంటుంది. టాం అండ్ జేర్రీలా కుక్కా..కోతీ ఒకదాని వెనుక ఒకటి పరుగులు పెడుతుంటే.. చూడ ముచ్చట అనిపిస్తుంది. ఇదిగో ఈ వీడియో అదే!

బాగా కొవ్వుపట్టి మందంగా ఉన్న కోడి.. లావుగా ఉన్న ఓ కుక్కను ఆటాడించేస్తోంది ఆ వీడియోలో. కుక్కను పరుగులు తీయించేస్తోంది. ఒకరౌండ్ కుక్క వెనుక పరిగెత్తి.. తరువాత దానికి ఆపోజిట్ లోకి వచ్చింది. కుక్కకు షాక్ తగిలింది. తరువాత కుక్క వెనుక కోడి పడింది. ఆ కుక్క కూడా కోడిని ఆడించాలని అనుకుంది కాబోలు.. దాని వెనుక నుంచి తప్పుకుని వేళాకోళం చేస్తోంది. మొత్తమ్మీద దాదాపు ఒక నిమిషం పాటు ఆ వీడియోలో రెండిటి మధ్యా దాగుడుమూతా దండాకోర్ ఆట సాగింది.

ట్విట్టర్ యూజర్ స్ట్రిక్ట్‌లీ క్రిస్టో ట్వీట్ చేసిన ఈ వీడియోని గమనిస్తే… ఓ పార్కులో ఆ కోడి, కుక్క సరదాగా ఛేజ్ చేసుకుంటున్న విషయం మనకు అర్థం అవుతుంది. నిజమే… అవి రెండూ ఫ్రెండ్స్. కాకపోతే… మరీ ఇంత సరదాగా ఎప్పుడూ లేవు. అందుకే ఈ సరదా ఛేజింగ్ వైరల్ అయ్యింది. ఇప్పటివరకూ ఈ దొంగాట వీడియో ను 44 లక్షల మందిని చూశారు. ఛేజింగ్ గేముల్లో ఇదే బెస్ట్ అని స్ట్రిక్ట్‌లీ ఈ వీడియోకి కాప్షన్ ఇవ్వగా… ఇది చాలా బాగుంది అని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. లైక్స్, షేర్స్ పెరుగుతూనే ఉన్నాయి. ఇది ఆస్కార్‌లో షార్ట్ ఫిల్మ్ కేటగిరీకి గెలవకపోతే… ఆస్కార్ తప్పే అని ఓ యూజర్ కామెంట్ రాయగా… ఇది రియల్ లైఫ్ కార్టూన్‌లా ఉందని మరొకరు రాశారు.

Also Read: Hare Swimming: మీరు ఎప్పుడన్నా కుందేలు నీటిలో ఈత కొట్టడం చూశారా? ఈ వీడియో చూడండి! మీరు రిలాక్స్ అవడం గ్యారెంటీ!

Tommy Atkins: అమెరికా మామిడిని ఇండియాలో పండిస్తున్న రైతులు. ఏంటి వాటి ప్రత్యేకత…? ( వీడియో )