Free Helmets: ఇల్లు అమ్మి మరీ ఉచితంగా హెల్మెట్ల పంపిణీ !! కారణం ఇదే

Free Helmets: ఇల్లు అమ్మి మరీ ఉచితంగా హెల్మెట్ల పంపిణీ !! కారణం ఇదే

Phani CH

|

Updated on: Apr 15, 2023 | 1:06 PM

జీవితంలో ఒక్కోసారి అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. అవి మన జీవితాలను ఎంతో ప్రభావితం చేస్తాయి. తాజాగా ఓ వ్యక్తికి ఎదురైన సంఘటనతో ఆయన ఊహించని నిర్ణయం తీసుకున్నాడు.

జీవితంలో ఒక్కోసారి అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. అవి మన జీవితాలను ఎంతో ప్రభావితం చేస్తాయి. తాజాగా ఓ వ్యక్తికి ఎదురైన సంఘటనతో ఆయన ఊహించని నిర్ణయం తీసుకున్నాడు. ఆగ్రా-లక్నో ఎక్స్ ప్రెస్ వేపై హెల్మెట్ లేకుండా ఎవరైనా వాహనదారుడు కనిపిస్తే వెంటనే అతణ్ని ఆపేస్తాడు. ఆ వాహనదారుడి చేతికి ఓ హెల్మెట్ ఉచితంగా ఇచ్చి, విష్ యు ఆల్ ద బెస్ట్ అని చెప్పి పంపిస్తాడు. అతనే బీహార్‌కు చెందిన రాఘవేంద్ర కుమార్. అతను ఇలా చేయడం వెనుక బలమైన కారణమే ఉంది. ఓ రోజు రాఘవేంద్ర కుమార్‌ స్నేహితుడు బైక్‌పై వెళుతూ ప్రమాదానికి గురై మరణించాడు. యుమునా ఎక్స్ ప్రెస్ వేపై ఓ ట్యాంకర్ అతడి స్నేహితుడి బైక్‌ని ఢీకొట్టింది. ఆ సమయంలో తలకు హెల్మెట్ లేకపోవడం వల్లే తన స్నేహితుడు ప్రాణాలు కోల్పోయాడని తీవ్ర ఆవేదన చెందాడు రాఘవేంద్ర. ఆదే ఆయనలో మార్పునకు కారణమైంది. తన స్నేహితుడిలా మరొకరు ప్రాణాలు కోల్పోకూడదని, తొమ్మిదేళ్ల క్రితం రాఘవేంద్ర ఈ ఉచిత హెల్మెట్ల పంపిణీని మొదలు పెట్టాడు. ఇప్పటి వరకు ఆయన 56 వేల హెల్మెట్లను, అది కూడా బీఐఎస్ మార్క్ ఉన్న నాణ్యమైన హెల్మెట్లను పంపిణీ చేశాడు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆదర్శగురువు.. కొబ్బరినూనె తెచ్చి స్టూడెంట్స్‌ తలలకు రుద్దిన టీచర్‌ !! ఎందుకో తెలుసా ??

Allu Arha: మాటల యుద్దం.. అందర్నీ ఫిదా చేస్తున్న అర్హ..

Pushpa 2: ఏకంగా 100 మిలియన్లు వైపు.. దిమ్మతిరిగేలా చేస్తున్న పుష్ప

తెలుగు హీరో చేసుంటే.. శాకుంతలం ఇంకో రేంజ్‌లో ఉండేదిగా !!

Balagam: బలగం” కు జేజేలు కొడుతున్న ప్రపంచం

 

Published on: Apr 15, 2023 12:57 PM