Viral Video: ఇదేం పిచ్చిరా బాబు.. లైకుల కోసం ఇలా కూడా చేస్తారా అంటోన్న నెటిజన్లు.. వైరల్ వీడియో..
ఈ ఫన్నీ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఇది ఇప్పటివరకు 49 మిలియన్లకు పైగా వీక్షణలను పొందడం విశేషం.
సోషల్ మీడియా(Social Media)లో ప్రతిరోజూ ఎన్నో వీడియోలు వచ్చి చేరుతంటాయి. వీటిలో కొన్ని ఆశ్చర్యపరిస్తే, మరికొన్ని కన్నీళ్లు పెట్టిస్తాయి. అయితే కొన్ని మాత్రం వెగటు పుట్టిస్తుంటాయి. అలాగే ప్రస్తుతం సోషల్ మీడియా కూడా సంపాదనకు ఓ మార్గంగా మారింది. ప్రజలు వివిధ రకాల ఫన్నీ వీడియోలను షేర్ చేస్తూ, డబ్బులు సంపాదిస్తున్నారు. అయితే, తాజాగా ఓ ఫన్నీ వీడియో నెట్టింట్లో తెగ చక్కర్లు(Viral Video) కొడుతోంది. సాధారణంగా కన్నీళ్లు తుడవడానికి లేదా నోరు తుడుచుకోవడానికి రుమాలు లేదా టిష్యూ పేపర్‌ని ఉపయోగిస్తుంటారు. అయితే ఈ వీడియోలో మాత్రం అలా చేయలేదు. దీంతో నెటిజన్లు అంతా షాక్‌కు గురవుతున్నారు.
ఓ మహిళ ఏడుస్తూ కన్నీళ్లు తుడుచుకోవడానికి ఎలుకను ఉపయోగించడాన్ని వీడియోలో చూడవచ్చు. ఆమె చేతిలో ఎలుకను పట్టుకుని, దానితో ఆమె కకన్నీళ్లు తుడుచుకోవడం కనిపిస్తుంది. దీని తరువాత, మరొక సన్నివేశంలో, ఒక వ్యక్తి ఆహారం తిని, మూతి తుడుచుకోవడానికి రుమాలు కోసం చూస్తున్నాడు, కానీ అతనికి రుమాలు కనిపించలేదు. ఆపై అతను టేబుల్ కింద నుంచి కుక్కను ఎత్తుకుని, దానికి తుడుచుకుంటాడు. ఆ తర్వాత మళ్లీ కుక్కను కిందకు దించాడు. కన్నీళ్లు లేదా నోరు తుడవడం కోసం ఇలాంటి వింత పనులు చేయడం బహుశా మీరు ఇప్పటి వరకు ఇలాంటివి చూసి ఉండరు.
ఈ ఫన్నీ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో khaby00 పేరుతో షేర్ అయింది. ఇది ఇప్పటివరకు 49 మిలియన్లకు పైగా వీక్షణలను పొందింది. 50 లక్షల మందికి పైగా వీడియోను కూడా లైక్ చేశారు. అదే సమయంలో, ప్రజలు వీడియోను చూసిన తర్వాత వివిధ రకాల కామెంట్లు కూడా చేశారు.
View this post on Instagram
Also Read: Viral Video: పిల్లికి ప్రష్టేషన్.. బాతుకు సెలబ్రేషన్.. ఈ సీను చూశారంటే పొట్టచెక్కలవడం ఖాయం..!
IPL 2022: రాజస్థాన్ రాయల్స్ కొత్త జెర్సీ వచ్చేసింది.. ఇన్ని స్టంట్స్ ఎందుకో బ్రో అంటోన్న ఫ్యాన్స్..