ములుగు జిల్లా అడవుల్లో మరో అద్భుత జలపాతం.. నీలి రంగు నీళ్లలో తెగ ఎంజాయ్ చేస్తున్న జనం

ములుగు జిల్లా అడవుల్లో మరో అద్భుత జలపాతం.. నీలి రంగు నీళ్లలో తెగ ఎంజాయ్ చేస్తున్న జనం

Phani CH

|

Updated on: Aug 22, 2023 | 9:43 AM

ములుగుజిల్లా అడవుల్లో మరో అద్భుత జలపాతం వెలుగులోకి వచ్చింది. జలపాతాలకు పెట్టింది పేరైన తెలంగాణ- చత్తీస్ గఢ్ సరిహద్దులోని ములుగు జిల్లా అడవుల్లో ఇప్పటికే ఎనిమిది జలపాతాలు పర్యాటకులను కనువిందు చేస్తున్నాయి. ఎక్కడ జలపాతం కంటపడితే అక్కడికి వెళ్లి జలకాలాడడం- ప్రకృతి ఒడిలో తనివితీరా ఎంజాయ్ చేయడం కోసం జనం పరుగులు తీస్తున్నారు. ఈ క్రమంలోనే ములుగు జిల్లా వాజేడు మండలంలోని బొగత జలపాతాలు, వెంకటాపురం మండలం లోని ముత్యాల ధార జలపాతాలు ప్రాచుర్యంలోకి వచ్చాయి.

ములుగుజిల్లా అడవుల్లో మరో అద్భుత జలపాతం వెలుగులోకి వచ్చింది. జలపాతాలకు పెట్టింది పేరైన తెలంగాణ- చత్తీస్ గఢ్ సరిహద్దులోని ములుగు జిల్లా అడవుల్లో ఇప్పటికే ఎనిమిది జలపాతాలు పర్యాటకులను కనువిందు చేస్తున్నాయి. ఎక్కడ జలపాతం కంటపడితే అక్కడికి వెళ్లి జలకాలాడడం- ప్రకృతి ఒడిలో తనివితీరా ఎంజాయ్ చేయడం కోసం జనం పరుగులు తీస్తున్నారు. ఈ క్రమంలోనే ములుగు జిల్లా వాజేడు మండలంలోని బొగత జలపాతాలు, వెంకటాపురం మండలం లోని ముత్యాల ధార జలపాతాలు ప్రాచుర్యంలోకి వచ్చాయి. తాజాగా మరో అద్భుతమైన జలపాతం వెలుగులోకి వచ్చింది. వాజేడు మండలంలోని దూసపాటికి కొద్ది దూరంలోనే ఉంది కొంగాల జలపాతం. మిగితా జలపాతాలకు పూర్తి భిన్నంగా ఈ జలపాతం కనువిందు చేస్తుంది. 50 అడుగుల ఎత్తు నుండి నీరు పాలధారలా జాలువారుతోంది. కిందికి జారి ఆ నీరు నీలి రంగులో పరవళ్లు త్రొక్కుతూ చూపరులును కనువిందు చేస్తోంది. ఎక్కడో అరేబియా దేశాలలోని సముద్రపు నీళ్ళలో ఎంజాయ్ చేస్తున్న అనుభూతి కలుగుతుందంటున్నారు పర్యాటకులు. నీలిరంగు నీళ్లలో పర్యాటకులు తెగ ఎంజాయ్ చేస్తున్నారు.. సెల్ఫీలకు ఫోజులు కొడుతూ జలపాతాల వద్ద కేరింతలు కొడుతున్నారు. ప్రకృతి అందాలు- గలగలపారే జల సవ్వడుల మధ్య తనివితీరా ఎంజాయ్ చేస్తున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వామ్మో రాక్షసగూళ్లు.. వాటిలో ఏం దొరికాయో తెలుసా ??

శ్మశానానికి తీసుకెళ్లగా చిన్నారిలో కదలికలు.. ఒక్కసారిగా..

మొసళ్ల మధ్యనుంచి దూసుకెళ్తోన్న బోటు !! నెట్టింట వైరల్‌ అవుతున్న షాకింగ్‌ వీడియో

Saif Ali Khan: ఆదిపురుష్ రావణుడి ఆస్తులెంతో తెలుసా ??

వర్షాలకు కొట్టుకొస్తున్న బంగారు నాణేలు !! అక్కడ బంగారు లంకె బిందెలు ఉన్నాయా ??