వామ్మో రాక్షసగూళ్లు.. వాటిలో ఏం దొరికాయో తెలుసా ??

వామ్మో రాక్షసగూళ్లు.. వాటిలో ఏం దొరికాయో తెలుసా ??

Phani CH

|

Updated on: Aug 22, 2023 | 9:41 AM

మూడువేల సంవత్సరాల కిందటి మానవులకు సంబంధించిన ఆనవాళ్లు ఏలూరు జిల్లా రుద్రమకోటలో బయట పడ్డాయి. గోదావరి నదికి అతి సమీపంలో ఉన్న ఆ గ్రామంలోని పొలాల్లో పెద్ద పెద్ద బండరాళ్ల కింద ఆదిమానవుల అవశేషాలు లభ్యమయ్యాయి. అవి సహజంగా ఏర్పడిన రాళ్లు కాదు, ఆదిమానవుల సమాధులు. కాకతీయుల కాలం, సింధు నాగరికత కంటే వేల సంవత్సరాల క్రితమే ఈ ప్రాంతంలో ఆదిమానవులు నివసించినట్లు ఆధారాలు ఉన్నాయి. ప్రపంచంలోనే రుద్రంకోట గ్రామానికి ప్రత్యేక స్థానం ఉన్నట్లు..

మూడువేల సంవత్సరాల కిందటి మానవులకు సంబంధించిన ఆనవాళ్లు ఏలూరు జిల్లా రుద్రమకోటలో బయట పడ్డాయి. గోదావరి నదికి అతి సమీపంలో ఉన్న ఆ గ్రామంలోని పొలాల్లో పెద్ద పెద్ద బండరాళ్ల కింద ఆదిమానవుల అవశేషాలు లభ్యమయ్యాయి. అవి సహజంగా ఏర్పడిన రాళ్లు కాదు, ఆదిమానవుల సమాధులు. కాకతీయుల కాలం, సింధు నాగరికత కంటే వేల సంవత్సరాల క్రితమే ఈ ప్రాంతంలో ఆదిమానవులు నివసించినట్లు ఆధారాలు ఉన్నాయి. ప్రపంచంలోనే రుద్రంకోట గ్రామానికి ప్రత్యేక స్థానం ఉన్నట్లు పూణే దక్కన్ కళాశాలకు చెందిన ప్రొఫెసర్లు వెల్లడించారు. 2018 లో పూణే, దక్షిణ కొరియా దేశాలకు చెందిన ప్రొఫెసర్లు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పురావస్తు శాఖ అధికారులు రుద్రమ కోట లో పరిశోధనలు జరిపి త్రవ్వకాలు నిర్వహించారు. ఈ తవ్వకాల్లో నేటికీ చెక్కుచెదరని భారీ ఆదిమానవుల సమాధులు వెలుగుచూశాయి. ఆదిమానవుల మనుగడ, జీవనం, సంస్కృతి సాంప్రదాయాలకు ఇవి అద్దం పడుతున్నాయి. ఈ సమాధుల్లో అడవి జంతువులను వేటాడడానికి ఉపయోగించే కత్తి, ఈటెలను పురావస్తు శాఖ వారు గుర్తించారు. ఈ సమాధులు సుమారు 8 అడుగుల నుంచి 16 అడుగుల మేర ఉన్నాయి. ఆదిమానవులు చనిపోయాక వారి మృతదేహాలను భూమిలో పాతిపెట్టి పైన పెద్ద పెద్ద రాతి బండలతో సమాధులను కట్టినట్లు తెలుస్తోంది. ఎటువంటి టెక్నాలజీ లేకుండానే ఆదిమానవులు అత్యంత భద్రతతో సమాధులు కట్టిన ఆనవాళ్లను పురావస్తు శాఖవారు గుర్తించారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

శ్మశానానికి తీసుకెళ్లగా చిన్నారిలో కదలికలు.. ఒక్కసారిగా..

మొసళ్ల మధ్యనుంచి దూసుకెళ్తోన్న బోటు !! నెట్టింట వైరల్‌ అవుతున్న షాకింగ్‌ వీడియో

Saif Ali Khan: ఆదిపురుష్ రావణుడి ఆస్తులెంతో తెలుసా ??

వర్షాలకు కొట్టుకొస్తున్న బంగారు నాణేలు !! అక్కడ బంగారు లంకె బిందెలు ఉన్నాయా ??

300 ఫోటోలు 30 దేశాల జెండాలను గుర్తిస్తున్న చిన్నారి !!