వర్షాలకు కొట్టుకొస్తున్న బంగారు నాణేలు !! అక్కడ బంగారు లంకె బిందెలు ఉన్నాయా ??

వర్షాలకు కొట్టుకొస్తున్న బంగారు నాణేలు !! అక్కడ బంగారు లంకె బిందెలు ఉన్నాయా ??

Phani CH

|

Updated on: Aug 22, 2023 | 9:37 AM

వందల ఏళ్ళ చరిత్ర కలిగిన ప్రాంతంలో ఒక్కసారిగా ఉలిక్కిపాటు మొదలైంది. వర్షాలకు బంగారు నాణాలు కొట్టుకొస్తున్నాయన్న ప్రచారంతో జనం బారులు తీరుతున్నారు. అది దక్షణాది రాష్ట్రాల్లో అతి పెద్ద బౌద్ధ స్థూపం. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ఈ దూళికట్ట ప్రాంతాన్ని శాతవాహనులతో పాటు.. కాకతీయులు పాలించారు. అందమైన కట్టడాలు నిర్మించి.. బంగారు రాశులు దాచిపెట్టారన్న ప్రచారం ఉంది. దీంతో.. గుప్త నిధుల కోసం యథేచ్చగా తవ్వకాలు చేస్తున్నారు కేటుగాళ్ళు.

వందల ఏళ్ళ చరిత్ర కలిగిన ప్రాంతంలో ఒక్కసారిగా ఉలిక్కిపాటు మొదలైంది. వర్షాలకు బంగారు నాణాలు కొట్టుకొస్తున్నాయన్న ప్రచారంతో జనం బారులు తీరుతున్నారు. అది దక్షణాది రాష్ట్రాల్లో అతి పెద్ద బౌద్ధ స్థూపం. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ఈ దూళికట్ట ప్రాంతాన్ని శాతవాహనులతో పాటు.. కాకతీయులు పాలించారు. అందమైన కట్టడాలు నిర్మించి.. బంగారు రాశులు దాచిపెట్టారన్న ప్రచారం ఉంది. దీంతో.. గుప్త నిధుల కోసం యథేచ్చగా తవ్వకాలు చేస్తున్నారు కేటుగాళ్ళు. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం దూళికట్టకు.. వందల సంవత్సరాల చరిత్ర ఉంది. ఎంతో ప్రాచీనమైన ప్రాంతం. గతంలో దూళికట్టను. దవలికోట అని పిలిచేవారు. ఇక్కడి బోధి వృక్షం కింద . బుద్ధుడు కొన్ని రోజుల పాటు ఉన్నట్లు చరిత్ర చెబుతుంది. ఈ బౌద్ధ స్థూపం పక్కనే వాగులు, వంకలు పారుతున్నాయి. గతంలో ఇక్కడ తవ్వకాలు జరిపితే పురాతన వస్తువులతో పాటు బంగారు నాణెలు, రాగి వాకెలు బయట పడ్డాయి. 1972లో పురవాస్తు శాఖ జరిపిన తవ్వకాల్లో భారీ విగ్రహాలు వెలుగు చూశాయి.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

300 ఫోటోలు 30 దేశాల జెండాలను గుర్తిస్తున్న చిన్నారి !!

బైక్‌ హ్యాండిల్‌ వదిలేసి వృద్ధుడి స్టంట్లు !! చూస్తే షాక్‌ అవ్వాల్సిందే

61 ఏళ్లు కడుపులో బిడ్డను మోసిన తల్లి.. చివరికి ??