పాము విషం - రేవ్ పార్టీ కేసులో యూట్యూబర్ అరెస్ట్..

పాము విషం – రేవ్ పార్టీ కేసులో యూట్యూబర్ అరెస్ట్..

Phani CH

|

Updated on: Mar 20, 2024 | 11:30 AM

పాము విషం-రేవ్ పార్టీ కేసులో బిగ్ బాస్ ఓటీటీ విజేత ఎల్విష్ యాదవ్ ఆదివారం అరెస్టయ్యాడు. శనివారం ఢిల్లీలో విచారణకు హాజరైన క్రమంలోనే అతడిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. త్వరలోనే ఎల్విష్‌ను కోర్టు ముందు హాజరుపరచనున్నారు. గతేడాది రేవ్ పార్టీలలో పాము విషాన్ని వినోదానికి వాడినందుకు అతనితో పాటు మరో ఐదుగురిపై నోయిడాలో వన్యప్రాణి చట్టం కింద కేసు నమోదైంది. ప్రస్తుత విచారణలో తను నిర్వహించే రేవ్ పార్టీల‌కు పాముల‌తో పాటు పాము విషాన్ని సరఫరా చేసినట్లు ఎల్విష్ అంగీకరించాడు.

పాము విషం-రేవ్ పార్టీ కేసులో బిగ్ బాస్ ఓటీటీ విజేత ఎల్విష్ యాదవ్ ఆదివారం అరెస్టయ్యాడు. శనివారం ఢిల్లీలో విచారణకు హాజరైన క్రమంలోనే అతడిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. త్వరలోనే ఎల్విష్‌ను కోర్టు ముందు హాజరుపరచనున్నారు. గతేడాది రేవ్ పార్టీలలో పాము విషాన్ని వినోదానికి వాడినందుకు అతనితో పాటు మరో ఐదుగురిపై నోయిడాలో వన్యప్రాణి చట్టం కింద కేసు నమోదైంది. ప్రస్తుత విచారణలో తను నిర్వహించే రేవ్ పార్టీల‌కు పాముల‌తో పాటు పాము విషాన్ని సరఫరా చేసినట్లు ఎల్విష్ అంగీకరించాడు. యాద‌వ్‌పై ఇదివరకే వైల్డ్‌లైఫ్ యాక్ట్ కింద కేసు బుక్ చేశారు. ప్రస్తుతం నార్కోటిక్ డ్ర‌గ్స్‌, సైకోట్రాఫిక్ ప‌దార్ధాల సెక్ష‌న్ 29 కేసును కూడా బుక్‌ చేశారు. ఈ కేసులో ఎల్విష్‌కు బెయిల్ దొర‌క‌డం క‌ష్ట‌మే అన్న వార్త వినిపిస్తోంది. 26 ఏళ్ల ఎల్విష్ గతేడాది స్నేక్ వినోమ్ కేసులో త‌న‌ పాత్ర లేద‌ని చెప్పాడు. తాజా విచారణలో వేర్వేరు రేవ్ పార్టీల‌కు పాము విషాన్ని స‌ర‌ఫ‌రా చేసిన‌ట్లు అంగీకరించాడు. ఇత‌ర స‌ర‌ఫ‌రాదారుల‌తోనూ ట‌చ్‌లో ఉన్న‌ట్లు చెప్పాడు. నోయిడాలోని సెక్టార్ 51లో రేవ్‌ పార్టీపై 2023 నవంబర్ 3న పోలీసులు దాడి చేసి 9 మందిని అదుపులోకి తీసుకున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అంబానీ ఇంట హోలీ వేడుక.. కోడలి డ్రెస్‌ ఖరీదు తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే

అంబానీ ఇంట ప్రీ-వెడ్డింగ్ వేడుకలో చోరీ.. ఐదుగురు అరెస్టు !!

అరుణాచల్‌ ప్రదేశ్ మాదే.. చైనా ప్రకటన

Ram Charan: రామ్​ చరణ్ RC 16లో యానిమల్ విలన్

ఎమర్జెన్సీ ఫ్లైట్ ల్యాండింగ్ ట్రయల్‌ రన్‌ సక్సెస్‌