వాషింగ్ మెషిన్‌లో భారీగా నోట్ల కట్టలు గుర్తించిన అధికారులు
దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఈడీ సోదాలు ముమ్మరంగా సాగుతున్నాయి. విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం నిబంధనల ఉల్లంఘన కేసులో సోదాలు చేపట్టిన ఈడీ అధికారులకు అనూహ్యంగా వాషింగ్ మెషిన్‌లో పెద్దమొత్తంలో నోట్ల కట్టలు పట్టుబడ్డాయి. ఈడీ తెలిపిన వివరాల ప్రకారం.. క్యాప్రికార్నియన్ షిప్పింగ్- లాజిస్టిక్స్, దాని అనుబంధ సంస్థలు.. బోగస్ సరకు రవాణా సేవలు, దిగుమతులు తదితరాల పేరిట షెల్ కంపెనీల సాయంతో సింగపూర్‌కు చెందిన రెండు సంస్థలతో రూ.1800
దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఈడీ సోదాలు ముమ్మరంగా సాగుతున్నాయి. విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం నిబంధనల ఉల్లంఘన కేసులో సోదాలు చేపట్టిన ఈడీ అధికారులకు అనూహ్యంగా వాషింగ్ మెషిన్‌లో పెద్దమొత్తంలో నోట్ల కట్టలు పట్టుబడ్డాయి. ఈడీ తెలిపిన వివరాల ప్రకారం.. క్యాప్రికార్నియన్ షిప్పింగ్- లాజిస్టిక్స్, దాని అనుబంధ సంస్థలు.. బోగస్ సరకు రవాణా సేవలు, దిగుమతులు తదితరాల పేరిట షెల్ కంపెనీల సాయంతో సింగపూర్‌కు చెందిన రెండు సంస్థలతో రూ.1800 కోట్ల మేర అనుమానాస్పద లావాదేవీలు జరిపినట్లు ఈడీకి విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో రంగంలోకి దిగిన ఈడీ అధికారులు.. క్యాప్రికార్నియన్ షిప్పింగ్- లాజిస్టిక్స్, దాని డైరెక్టర్లు విజయ్ కుమార్ శుక్లా, సంజయ్ గోస్వామిల ఇళ్లతోపాటు అనుబంధ సంస్థల ప్రాంగణాల్లో సోదాలు నిర్వహించారు. ఢిల్లీ, హైదరాబాద్, ముంబయి, కోల్‌కతా, కురుక్షేత్ర ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలోనే రూ.2.54 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. అందులో కొంతమొత్తం వాషింగ్ మెషిన్‌లో దొరికిందని పేర్కొన్న ఈడీ.. దీనికి సంబంధించిన ఫొటోను ఎక్స్‌లో పోస్ట్ చేసింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
తిరుమల శ్రీవారి సేవలో రామ్‌చరణ్ దంపతులు
సన్ ట్యాన్ తొలగించే సూపర్ చిట్కాలు.. ఇంట్లో దొరికే ఈ పదార్థాలు చాలు
బెట్టింగ్‌కు బానిసై రూ.కోటి అప్పు చేసిన భర్త.. ఆత్మహత్య చేసుకున్న భార్య
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్‌లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

